ఢీ జోడి నుండి భానుశ్రీ అవుట్, రేష్మి ఇన్….. ఇదిగో ప్రూఫ్

0
436
ఈటివిలో ప్రసారం అవుతూ, మంచి రేటింగ్స్ మరియు ప్రేక్షకుల ఆదరాభిమానాలతో ముందుకు సాగుతున్న షోలలో ఢీ ఒకటి. అయితే ఇటీవల ఢీ 10 వ సీజన్ పూర్తి అయిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఢీజోడి పేరుతో ప్రస్తుతం సరికొత్త సీజన్ ఈటీవీలో ప్రసారం అవుతోంది. అయితే ఈ సీజన్ లో ఎప్పటివలె సుధీర్ మేల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఫిమేల్ హోస్ట్ గా మాత్రం రేష్మి ని తొలగించి నిర్మాతలు, ఇటీవల బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన భానుశ్రీని తీసుకుంది. 
ఇక భానుశ్రీ, సుధీర్ ల జోడితో మంచి జోష్ గా సాగుతున్న ఈ షోనుండి భానుశ్రీ త్వరలో తప్పించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి సంచలనం సుష్టిస్తోంది. ఇక మ్యాటర్ ఏంటంటే, ఢీ జోడి మొదలెట్టిన దగ్గరినుండి ఎంతోమంది ప్రేక్షకులు భానుశ్రీ యాక్టింగ్ బాగుందని కితాబిస్తున్నప్పటికీ కూడా, మళ్ళి రేష్మి నే సుధీర్ ప్రక్కన జోడిగా తీసుకోవాలని విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారట. అయితే దానిపై కొంత ఆలోచనలో పడ్డ ఆ షో నిర్మాతలు మళ్ళి రేష్మినే తీసుకోవాలని నిర్ణయించారట. నిజానికి కొన్నాళ్లుగా రేష్మీకి డేట్స్ ఖాళీ లేకపోవడం వల్లనే తాము కొత్తవారికోసం వెతికి, ఆమె స్థానంలో భాను ని తీసుకున్నామని అంటున్నారు.
ఇక ఢీజోడిలోకి రేష్మి మళ్ళి తిరిగి అడుగుపెడుతోంది అనడానికి నిర్దర్శనం ఇదే అని ఒక ఫోటో చెప్పకనే చెపుతోంది. ఈ ఫోటోని బట్టి చూస్తే షోలోకి రేష్మి రీ ఎంట్రీ ఇచ్చింది ఖాయమనే అనిపిస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ ఇప్పుడే ప్రసారం కాదని, మరొక మూడు, నాలుగు వరాల తరువాత ప్రసారం అవుతుందని అంటున్నారు. మరి ఈ ఫోటో ప్రకారం నిజంగానే భానుశ్రీని ఢీ జోడి నుండి తప్పించి మళ్ళి రేష్మినే తీసుకుంటున్నారా, లేదా అనేది తెలియాలంటే మాత్రం ఇంకొద్దిరోజులువరకు ఓపికపట్టవలసిందే…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here