ఢీ జోడి లేటెస్ట్ ప్రోమోలో అదరగొట్టిన శేఖర్ మాస్టర్ కొడుకు…చూస్తే షాక్ అవ్వాల్సిందే!

0
270
ఎప్పటిలాగే రేపు వారం ప్రసారం కాబోయే ఢీ జోడి  ప్రోగ్రాం తాలూకు నేడు విడుదలైన ప్రోమో, ఆ షోపై విపరీతమైన ఆసక్తిని పెంచింది అనే చెప్పాలి. ఇక ప్రోమో ప్రకారం షో ఓపెనింగ్ లో కుమారి 21ఎఫ్ సినిమా ఫేమ్ హెబ్బా పటేల్ తాను ప్రస్తుతం నటించిన స 24 కిస్సెస్ సినిమా హీరోతో కలిసి సందడి చేసింది. ఇక ఆమె షోలోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో షోలో వారందరూ ఒక్కసారిగా ఈలలు గోలలతో హోరెత్తించారు. ఇక యాంకర్ ప్రదీప్, సుధీర్ తో మాట్లాడుతూ, ఎందుకురా ఇందాకటినుండి అంతసిగ్గు పడిపోతున్నావ్, ఆపరా అనగానే సుధీర్ మరింత సిగ్గుపడడం చూసి, నువ్వు అలా సిగ్గుపడకురా చచ్చిపోవాలనిపిస్తుంది అని అనడంతో షో మొత్తం కేరింతలతో హోరెత్తిపోతుంది. ఇక తన ఫేవరెట్ హీరోయిన్ హెబ్బాని ఇలా స్టేజిపై చూస్తుంటే ఆనందం ఆగట్లేదు అని సుధీర్ అంటాడు.
మేడం ఈ సినిమాలో మీపక్కనున్న హీరోగారికి 24 కిస్సులు ఇచ్చారు, నాకు లైఫ్ లో ఒక్క కిస్ కూడా లేదు అనగానే , నో ప్రాబ్లమ్ నేను నీకు 25వ కిస్ ఇస్తానులే అని హెబ్బా అనడంతో సుధీర్ విపరీతమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. ఇక షోలో కంటెస్టెంట్లు తమ అదిరిపోయే పెర్ఫార్మన్స్ తో అలరించడంతో, జడ్జీలు వారిని బాగా మెచ్చుకుంటారు. అయితే షోలో కొందరు డాన్సర్లు పెర్ఫార్మన్స్ చేస్తున్న సమయంలో వారి మధ్యకి సడన్ గా వచ్చి వారితో కలిసి అద్భుతంగా డాన్స్ చేస్తాడు శేఖర్ మాస్టర్ కొడుకు. ఆ అబ్బాయి డాన్స్ చూసి చప్పట్లు కొట్టిన శేఖర్ మాస్టర్, వెంటనే స్టేజి దగ్గరకు వచ్చి, అతనితో కలిసి కొన్ని స్టెప్పులు వేసి కాసేపు షో మొత్తాన్ని ఖుషి చేస్తాడు. ఇక ప్రోమో మొత్తాన్ని బట్టి చూస్తే, రేపు వారం జరగబోయే షో మంచి ఉత్సాహంతో సాగుతూ, ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుందని మాత్రం అర్ధం అవుతుంది. ఇక ఈ ప్రోమోపై పలువురు నెటిజన్లు అదిరిపోయింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here