తనకు బట్టతల రాకపోవడానికి నాగ్ చెప్పిన కారణం తెలిస్తే షాక్ అవుతారు!

0
59
నిజానికి ఇంట్లో తండ్రికి బట్టతల ఉంటె అది కొడుకులకి కూడా రావడం ఖాయమని చెప్తుంటారు మన పెద్దవాళ్ళు. కొంతమందిని చూస్తే అది నిజమే అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే మన టాలీవుడ్ మన్మధుడు,యువసామ్రాట్ నాగార్జున విషయంలో అలా ఎందుకు జరుగలేదనే సందేహం మనలో చాలామందిలో వుంది. ఎందుకంటే అక్కినేనికి, అలాగే ఆయన పెద్దబ్బాయి వెంకట్ కి కూడా బట్టతల ఉంది. మరి అది ఆయన రెండో కొడుకు నాగార్జునకి మాత్రం ఎందుకు రాలేదు, ఒకవేళ అయన హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్, వైవింగ్ వంటి నూతన ట్రీట్మెంట్స్ ఏవైనా చేయించుకున్నారా అని మరికొందరి అనుమానం. అయితే ఇదే ప్రశ్న నాగార్జునని ఇటీవల ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా అడిగితే, ఆయన అసలు నిజం ఏమి చెప్పారంటే, నిజానికి తనకు 28 ఏళ్ళ వయసులో జుట్టు పలచబడం మొదలయ్యిందట. నాన్న, అన్నకు లాగానే తనకి కూడా బట్టతల వచ్చేస్తుందేమోనని చాలా భయపడిపోయాడట నాగ్.
Related image
సరిగ్గా అదే టైమ్ లో కేరళ లో దొరికే ఆయుర్వేద తైలం గురించి ఓ వ్యక్తి నాగ్ కి చెప్పాడట. ఆ తైలం ఖరీదు కేవలం 80 రూపాయలు మాత్రమేనని తెలిసి, వెంటనే నాగ్ తన పర్సనల్ కాస్ట్యూమర్ శేఖర్ ని కేరళ పంపించారట. అయితే అక్కడ ఈ తైలాన్ని ఒక్కొక్కరికి ఒక్కో బాటిల్ మాత్రమే ఇస్తారట. కానీ కొంతమంది 500 రూపాయలకు బ్లాక్ లో కూడా అమ్ముతుంటారట. అలా నాగ్ అసిస్టెంట్ తో పెద్దమొత్తంలో ఆరు నెలలకు సరిపడా ఆయిల్ బాటిల్స్ తెప్పించారట. అనంతరం తైలం రాయడం మొదలు పెట్టిన తర్వాత కొత్త జుట్టు రావడం మొదలయ్యిందట. ఇక అప్పుడు వచ్చిన జుట్టు, ఇప్పటివరకు ఊడ లేదట. అదన్నమాట నాగార్జున నిగనిగలాడే కురుల వెనుక ఉన్న రహస్యం. అయితే అది మాత్రమే కాక, నాగార్జున చాలా వరకూ ఇలా ఫుడ్, వ్యయం సంబదించిన నియమాలు, నిపుణుల సలహాలను తప్పనిసరిగా అనుసరిస్తారని, అందుకే శారీరకంగా కూడా అయన అంత యంగ్ గా కనపడతారని అయన సన్నిహిత వర్గాల సమాచారం…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here