తల్లితండ్రుల బలవంతానికి బలై ప్రాణాలు తీసుకున్న టాప్ హీరోయిన్…ఎవరో తెలిస్తే కన్నీళ్లాగవ్?

0
252
సినిమా జీవితంలో ఎందరో నటీనటులు తమ టాలెంట్ ని ఎంతగా నిరూపించుకున్నప్పటికీ కొందరు తమ అదృష్టంకొద్దీ సమయం కలిసివచ్చి ఉన్నత స్థానాల్లో నిలిస్తే, మరికొంతమంది మాత్రం పెద్దగా సక్సెస్ కాలేక అలానే ఉండిపోతుంటారు. అయితే నిజానికి సినిమా అనేది ఒక గ్యాంబ్లింగ్ వంటిదని, ఇక్కడ ఆట ఆడడం మనవంతు, అయితే అందులో విజయం సాధిస్తారో లేదో అనేది తేల్చడం మాత్రం ప్రజల వంతు అని కొందరు సినీ ప్రముఖులు అంటుంటారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, టాలీవుడ్ కి విక్టరీ వెంకటేష్ సరసన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ఆర్తి అగర్వాల్. ఆ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ కావడంతో, అక్కడినుండి ఆర్తికి మంచి అవకాశాలు దక్కాయి. నిజానికి ఆమె అప్పట్లో దాదాపుగా అందరు పెద్దహీరోలతో కలిసి నటించారు. ఆ తరువాత మెల్లగా ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టడం మొదలయింది. నిజానికి ఆమె చెల్లెలు అదితి అగర్వాల్ కూడా అప్పట్లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. అయితే ఆర్తికి సినిమా అవకాశాలు తగ్గడంతో ఆమె ఇంటికే ఎక్కువ పరిమితం అయింది.
అయితే ఆమె అప్పట్లో తరుణ్ సరసన నువ్వులేక నేనులేను సినిమాలో నటించేటప్పుడు అతడితో ప్రేమలో పడిందని పలు పుకార్లు వచ్చాయి. ఇక వాటిని నిజం చేస్తూ, వారిద్దరూ పలుచోట్ల మీడియా కంట పడ్డారు. ఇక ఆర్తికి సినిమా అవకాశాలు తగ్గిన తరువాత తరుణ్ ఆమెను దూరం పెట్టాడని, మొదటినుండి తనతో ఎంతో ప్రేమగా వుండే తరుణ్, తనను ఒక్కసారిగా దూరం పెట్టడంతో కృంగిపోయిన ఆర్తి ఆ మధ్య ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. ఇక ఆ ప్రమాదం నుండి ఎలాగో బయటపడిన ఆర్తి ఆ తరువాత అమెరికాకు వెళ్ళిపోయింది. నిజానికి తరుణ్ కి కూడా పెద్దగా అవకాశాలు లేకపోవడం, అదీకాక అయన తల్లి రోజారమణి కూడా ఆర్తితో ప్రేమ వ్యవహారంపై తీవ్రంగా అగ్రహించారని సమాచారం. ఇక అమెరికా వెళ్లిన ఆర్తి తీవ్రమైన మనోవేధనతో బాగా బరువు పెరిగారు. అయితే ఆమె తల్లితండ్రులు మాత్రం, నువ్వు ఎలాగైనా బరువు తగ్గి మళ్ళి సినిమాల్లో నటించాలని ఒత్తిడి చేసేవారట.
ఇక వారి కోరికమేరకు బరువుతగ్గడానికి లైపోసక్షన్ ట్రీట్మెంట్ తీసుకున్న ఆర్తి, ఆ ట్రీట్మెంట్ కొంత వికటించడంతో కొద్దిరోజులకు హార్ట్ ఎటాక్ వచ్చి తుది శ్వాస విడిచారు. ఆమె మరణం, అభిమానులను తీవ్రంగా కుంగదీసింది. నిజానికి ఒకరకంగా ఆర్తి మరణానికి అటు తరుణ్ కుటుంబం, ఇటు తన కుటుంబం ఇద్దరూ కూడా ముఖ్య కారణంగా నిలిచారు. అయితే ఎన్నాళ్ళక్రితమో జరిగిన ఈ వార్తపై నిజానిజాలు ఇన్నాళ్లకు బయటకు రావడంతో పలువురు నెటిజన్లు ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here