తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ పర్సనల్ లైఫ్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0
274

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏడు వింతల్లో ఒకటిగా మన దేశంలోని తాజ్ మహల్ నిలిచిన విషయం తెలిసిందే. తాజ్ మహల్ పేరు చెపితే చాలు, కేవలం భారతీయులు మాత్రమే కాదు ఎందరో విదేశస్థులు సైతం దాని గొప్పతనాన్ని, మరియు దాని శిల్ప సౌందర్యాన్ని పొగడకుండా ఉండలేరు. అయితే అంతటి గొప్ప కళాఖండాన్ని గుర్తుచేసుకున్న మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు షాజహాన్. కాగా అయన ఆ కట్టడాన్ని తన భార్య ముంతాజ్ మరణాంతరం ఆమెకు గుర్తుగా ఏదైనా ఉండాలని, దానిని అప్పట్లో దేశ విదేశాలనుండి ఎందరో గొప్ప శిల్పులను రప్పించి, అచ్చమైన పాలరాతితో దానిని కట్టించారట. అయితే అంతటి గొప్ప కట్టడాన్ని కట్టించిన షాజహాన్ జీవిత చరిత్ర మరియు వ్యక్తిగత జీవితం గురించి వింటే మాత్రం ఎంతటివారికైనా ఆశ్చర్యం వేస్తుందని అంటున్నారు చరిత్రకారులు. నిజానికి  బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్ ల తరువాత భరత దేశావనిని పరిపాలించిన మొఘల్ చక్రవర్తి షాజహాన్. అయితే షాజహాన్ వ్యక్తిగత జీవితం గురించి మాత్రం దాదాపుగా ఎవ్వరికీ తెలియదు అనే చెప్పాలి. నిజానికి అప్పటి చక్రవర్తులు తమకు సంబందించిన వ్యక్తిగత విషయాలను బయటకు రానీయకుండా, పైగా చరిత్రకారులను కూడా తమ రాజ్యంలో ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ, వారికి అనుకూలంగా రాయించుకునేవారు అనే విమర్శలు కూడా వున్నాయి.

అయితే షాజహాన్ 1628-1658 వరుకు భారత దేశాన్ని ఏక ఛత్రాధిపత్యంతో పరిపాలించాడు. కాగా చివరి దశలో తన కుమారుడు ఔరంగజేబు చేత జైలులో ఖైదు చేయబడి, ఆ జైలులోనే 1666లో మరణించాడు. అయితే ఆ సమయంలో ఇక్కడ పర్యటించిన కొందరు విదేశీ పర్యాటకులు రాసిన పుస్తకాలను పరిశీలిస్తే కానీ అప్పటి మొఘల్ చక్రవర్తుల్లో షాజహాన్ ఎంతటి స్త్రీలోలుడో మనకు అర్ధం కాదు. నికోలో మానుసి అనే ఇటాలియన్ చరిత్ర కారుడు రాసిన పుస్తకం ప్రకారం షాజహాన్ మందిరమంతా దాదాపుగా కొన్ని వందలమంది ఆడవారు ఉండేవారని, వయోబేధం కూడా లేకుండా తనకు నచ్చిన అమ్మాయి కనపడితే చాలు షాజహాన్ ఆమెను తన వశం చేసుకుని అనుభవించేదాకా వదిలేవాడు కాదట. అయితే మరొక విదేశీ చరిత్రకారుడు చెప్పినదాన్నిబట్టి చూస్తే షాజహాన్ కు అఫీషియల్ గా ఏడుగురు భార్యలు ఉండేవారని, అందులో ముంతాజ్ బేగం నాలుగవ భార్య అని తెలుస్తోంది. ముంతాజ్ 13 మంది బిడ్డలకు జన్మనిచ్చిన తరువాత 14వ బిడ్డను కన్నవెంటనే మరణించిందట. ఆమెపై విపరీతమైన ప్రేమ వుండడంతోనే ఆమె మరణాంతరం తాజ్ మహల్ కట్టించాడట.
ఇక షాజహాన్ ఎంతటి స్త్రీలోలుడో అని చెప్పడానికి, ఆయన్ని కొడుకు ఔరంగజేబు ఖైదు చేసిన సమయంలో కూడా తన చుట్టూ దాదాపుగా ఒక వందమంది అమ్మాయిలు ఎప్పుడూ ఉండాలి అని కోరాడట. ఇక అయన కామ కలాపాలకు కన్నకూతుర్లు కూడా బలయ్యారని యూరోపియన్ చరిత్రకారుడు ఫ్రాంకోయిస్ బెర్నియర్ రాసిన తన ట్రావెల్స్ ఇన్ మొఘల్ అంపైర్ అనే పుస్తకంలో వుంది. అయన రాసిన దానిని ప్రకారం షాజహాన్ పెద్ద కుమార్తెలు జహానారా, బేగం సాహెబా ఎంతో అందగత్తెలట. అయితే వారిపై వున్న మోజుతో ఒకానొక సమయంలో వారిని కూడా వదలకుండా కిరాతకంగా అత్యాచారం చేసేవాడట. దానిని సమర్ధిస్తూ అయన కోటలోని వారు కూడా వత్తాసు పలికేవారట. చక్రవర్తికి తన తోటలోని ఫలాలను రుచిచూసే అధికారం ఉంటుంది, అది ఏ మాత్రం తప్పుకాదు అని అయన మందిరం గోడలపై రాసి వుంది అంటే, అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు అని ఆ చరిత్రకారుడు రాసిన పుస్తకంలో ఉందట. చూసారుగా ఎంతో సుందరమైన తాజ్ మహల్ ని కట్టించిన షాజహాన్ ని అందరూ ఎంతటి గొప్పవాడో అనుకుంటారు, నిజానికి అయన వ్యక్తిగత జీవితం గురించి తెలిసిన వారెవరైనా ఆయన్ని అసహ్యించుకుంటారని కొందరు చరిత్రకారులు ఆరోపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here