తాను పెళ్లిచేసుకోబోతున్నఅబ్బాయిని పరిచయం చేయనున్న రష్మీ, షాక్ లో సుధీర్

0
266
ప్రస్తుతం తెలుగు టివి ఛానల్స్ లో ప్రసారం అవుతున్న కొన్ని ఫేమస్ షోల్లో తమ అద్భుతమైన యాంకరింగ్ ప్రతిభతో వీక్షకులను ఆకట్టుకుంటూ మంచి పేరు సంపాదించిన యాంకర్లలో రష్మీ, మరియు అనసూయ ఇద్దరు వుంటారు. అయితే ఒకప్పుడు వున్న యాంకర్లలో సుమ ఇప్పటికీ యాంకరింగ్ చేస్తున్నప్పటికీ, యూత్ లో మాత్రం వీరిద్దరికీ ప్రస్తుతం ఎక్కువగా క్రేజ్ ఉందని చెప్పాలి. అంతేకాదు ఈ ఇద్దరూ అక్కడక్కడా కొన్ని సినిమాల్లో కూడా నటిస్తూ తమ పరిధిని మరింత పెంచుకుంటున్నారు. ఇక కొద్దిరోజులుగా యాంకర్ రష్మీ, జబర్దస్త్ ఫేమ్ సుధీర్ ని పెళ్లిచేసుకుంటోంది అనే వార్తలు కూడా కొన్ని మీడియా మాధ్యమాల్లో గుప్పుమన్నాయి. అయితే అవన్నీ ఒట్టి పుకార్లని వారిద్దరూ ఎంత కొట్టిపారేసినప్పటికీ కూడా ఇప్పటికీ వారిద్దరి మధ్యలో ఏదో ఉందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం రష్మీ తన లైఫ్ పార్టనర్ కి సంబంధించి ఒక షాకింగ్ విషయం తన అభిమానులతో పంచుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఒక ఎన్నారై అని , అంతేకాదు అయన యూఎస్ఏ లో ఒక పెద్ద వ్యాపారవేత్త అని చెప్పింది రష్మీ. ఇక ఈ వార్త విన్న రష్మీ అభిమానులు ఒక్కసారిగా విపరీతమైన ఆనందోత్సహాల్లో మునిగిపోయారట. అయితే రష్మీ తన పెళ్లి చేసుకోబోతున్న విషయం చెప్పడంతో సుధీర్ కొంత ఆవేదన చెందాడని సమాచారం. మరి వారిద్దరి మధ్యన ఏమి లేకపోతే సుధీర్ ఎందుకు రష్మీ పెళ్లిప్రకటన పై అంత మనోవేదన చెందుతున్నాడు అన్ని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం వారి పర్సనల్ విషయాల్లో తలదూర్చడం తప్పు, అందువల్ల దానిపై మనం కామెంట్ చేయరాదని మరికొందరు అంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మరి సంచలనం సృష్టిస్తోంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here