తారజువ్వలు షోలో సొమ్మసిల్లిన సుధీర్…..షాక్ లో రష్మీ,సుమ?

0
219

 

త్వరలో రానున్న దీపావళి పండుగను పురస్కరించుకుని ఈటీవీలో ప్రసారం కానున్న తరాజువ్వలు షోకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రోమో, ఆ షో పై మంచి క్రేజ్ ని తీసుకొచ్చింది. ఇక నేడు విడుదలైన మరొక ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో అదరగొడుతోంది. ఇక ఈ ప్రోమోలో చలాకి చంటి, రష్మీ ల మధ్య వచ్చే సన్నివేశాలు, ముఖ్యంగా అందులో చంటి నువ్వు ఒక షాపువాడివి అయినందుకు సంతోషంగా వుంది అనగానే, షాపువాడినా అదేంపిలుపు అంటాడు. అవును ఎవరైనా అమ్మాయిని పెళ్ళిచేసుకుంటే, ఒక ఇంటివాడివి అయ్యావు అంటారు, అలానే షాపు పెడితే, షాపువాడివి అయ్యావ్ అనే కదా అంటారు అనగానే షోలో వారందరు ఈలలతో గోల చేస్తారు. ఇక ప్రోమోలో సుధీర్ మరియు రామ్ ప్రసాద్ చేసిన స్కిట్ బాగుంది. అందులో మా నాన్నకు తెలియకుండా సిగరెట్ తాగాను, తెలిసిపోయింది, కాలేజీ ఎగ్గొట్టి తిరిగాను తెలిసిపోయింది.

థాంక్స్ రా నేను ప్రస్తుతం మందుకొడుతున్న సమయంలో మా నాన్నకు తెలియకుండా దాచావు  అంటాడు. అయితే నిజానికి ఆ సమయంలో సుధీర్, అరేయ్ ఇందాకటినుండి మీ నాన్న ఫోన్ లో లైన్ లోనే వున్నాడు అనడంతో ఒక్కసారిగా అందరి మోహంలో నవ్వులు పూస్తాయి. ఇక ప్రోమో మొత్తంలో వూ లాల వూ లాల సాంగ్ మేల్ మరియు ఫిమేల్ రెండు వెర్షన్స్ పాడి అదరగొట్టింది యాంకర్ శ్రీముఖి. ఇక ఆమె పాటకు అందరూ యెగిరి డాన్సులు వేయడం మొదలెడతారు. అయితే ఈ షోకి యాంకర్లుగా వచ్చిన సుమ మరియు అలీ మధ్య సాగె సంభాషణ బాగుంటుంది, మగవాళ్ళు బయటికెళ్లి కష్టపడి ఇంటికి ఒక వందరూపాయలు తీసుకురావడానికి ఎంత కష్టపడతారో తెలుసా అని యాంకర్ రవి అనగానే, ఒక్కసారిగా సుమ మాట్లాడుతూ, మీరు బయటుకెళ్ళి సంపాదించి డబ్బులు తెస్తే, ఇంట్లో భార్య ఎంతో కష్టపడి ఇంటిల్లిపాదికి వండి, వార్చి, ఇల్లు శుభ్రంగా ఉంచి, పెద్దవాళ్లందరిని చక్కగా ఆదరిస్తూ అందరిని ఆనందంగా చూసుకుంటుంది.
ఈ విధంగా చూస్తే, ఇల్లాలే కదా ఇంటికి దీపం అనగానే, అలీ ఆమెకు పక్కనే వున్న ఒక వస్తువును మహానటి అంటూ గిఫ్ట్ ఇవ్వగానే అందరూ పగలబడి నవ్వుతారు. ఇక ప్రోమోలో శ్రీముఖి ఒక షాప్ కి వెళ్ళి కొంతమంది ప్రేక్షకులతో కలిసి షాపింగ్ చేస్తూ ఆటపట్టించడం, ఇక ప్రోమో చివరిలో సుధీర్, విష్ణుప్రియతో కలిసి చేసే డాన్స్ అద్భుతంగా ఉందనే చెప్పాలి. అయితే ఆ సమయంలో అనుకోకుండా సుడిగాలి సుధీర్ స్పృహ తప్పడంతో షోలో వారందరు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ తరాజువ్వలు ప్రోమో ను బట్టి చూస్తే, షో మంచి ఆసక్తికరంగా హుషారుగా సాగనున్నట్లు తెలుస్తోంది.

 

Sudigali Sudheer Shocking Reaction About Anchor Rashmi|#Jabardasth|#Dheejodi|GARAM CHAI