తారాజువ్వలు షోలో మరొక్కసారి బూతులు మాట్లాడిన ఆలీ….. షాకైన సుమ, రష్మీ, విష్ణుప్రియ!

0
192
ఇప్పటికే గడిచిన దసరా పండుగను పురస్కరించుకుని ఈటివి ఛానల్ వారు ప్రసారం చేసిన సరైనోళ్లు షో మంచి సక్సెస్ సాధించడంతో, రాబోయే దీపావళి సందర్భంగా మరొక కొత్త కాన్సెప్ట్ తో తారాజువ్వలు అనే కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతున్నారు ఆ ఛానల్ వారు. అయితే ఈ షోకి సంబంధించి ఇప్పటికే విడుదలైన రెండు ప్రోమోలు యూట్యూబ్ లో దుమ్ముదులిపాయి. ఇక ప్రస్తుతం కాసేపటి క్రితం మరొక ప్రోమోని విడుదల చేసారు యూనిట్ వారు. ఇకపోతే ఈ ప్రోమోలో దీపావళి టపాసుల షాపును ప్రారంభించేందుకు పోవే పోరా, పటాస్, జబర్దస్త్, పటాస్ ప్రోగ్రామ్స్ తాలూకు పార్టిసిపెంట్స్ కి ఛాలెంజ్ విసురుతాడు జడ్జి అయిన అలీ. దానితో రష్మీ, విష్ణుప్రియ, శ్రీముఖి, రవి, సుధీర్ అందరూ ఎవరికి వారే ఆ ఛాన్స్ సంపాదించాలని తమ ప్రయత్నాలు చేస్తుంటారు.
ఇక షో మధ్యలో సడన్ గా యాదమరాజు ఢీ జోడి టీమ్ డాన్సర్స్ పై వాళ్ళ డాన్స్ ఏముంది, అదంతా ఫసక్ అనడంతో చిట్టిమస్టర్, యాష్ మాస్టర్ యాదమరాజు పై  ఫైర్ అవుతారు. అయితే యాదమరాజు సారీ చెప్పినప్పటికీ వినకపోవడంతో ఆ వివాదంలో కలుగచేసుకున్న శ్రీముఖి, రాజు మీకు సారీ చెప్పినా కూడా మీరు దీన్ని రాద్దాంతం చేయవద్దని గట్టిగా చెప్పడంతో షో మొత్తం సీరియస్ గా మారిపోతుంది. ఇక షో ప్రారంభం సమయంలో అలీ ఆయా ప్రోగ్రామ్స్ యాంకర్లతో మాట్లాడుతుండగా, వారందరూ అలీ గారు అని గట్టిగా అనగానే, ఆలీ నీ చేతిలో నా …అని బూతుపదం వాడడంతో అక్కడివారందరు ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే ఇదివరకు అలీ ఇలా బూతులు మాట్లాడుతూ, అలానే ఆడవారిపై పరుషంగా వ్యవహరించడంతో పలు మహిళా సంఘాల వారు ఆయనకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

తారజువ్వలు షో లోనే బూతులు మాట్లాడిన కమెడియన్ ఆలీ|#Tarajuvallu|#ActorAli|#AnchorSuma|GARAM CHAI

ఇక ప్రస్తుతం అలీ ఇలా డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడటాన్ని పలువురు నెటిజన్లు తప్పుపడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కింది స్థాయినుండి కష్టపడి పైకివచ్చి, ఇప్పుడు ఎంతో ఉన్నత స్థాయిలో అలీ వంటి వ్యక్తి ఇలా ద్వంద్వార్ధాలు వచ్చేలా మాట్లాడడం సరికాదని, అయినా ఇదివరకు కూడా అయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినపుడు మరొక్కసారి తప్పుగా మాట్లాడను అని చెప్పి కూడా, మళ్ళి అదే తప్పు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మరి రేపు షో మొత్తం ప్రసార సమయంలో ఆలీ ఇంకెన్ని బూతుపదాలు వాడుతారో అని కొందరు జోకులు వేస్తున్నారు..

తార జువ్వలు షో లో గొడవపడ్డ యష్ మాస్టర్ ,యాదమ్మరాజు|#TaraJuvvalu|#YashMaster|#YadamaRaju|GARAM CHAI

 

Anchor Suma Emotional About Her Bad Situations In Tarajuvvalu Show|#SumaKanakala|#Ali|GARAM CHA