తిత్లీ తుఫాను బాధితులపై నారా బ్రాహ్మణి సంచలన నిర్ణయం…. షాక్ లో చంద్రబాబు!

0
209
ఇటీవల శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలను చాలావరకు నాశనం చేసి, భీభత్సం చేసిన తిత్లీ తుఫాను ప్రభావాన్ని ఎప్పటికి మరిచిపోలేమని చెప్పాలి. అధికార పక్షం సహా, అందరూ రాజకీయ నాయకులు ఆ ప్రాంత ప్రజలకు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇక కొందరు సినీ ప్రముఖులు సైతం, ఆర్ధిక మరియు ఇతర రూపేణా సాయాన్ని అందిస్తూ తమ గొప్ప గుణాన్ని చాటుకుంటున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు కూడా అక్కడి వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కొంత సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు హిందూపురం ఎమ్యెల్యే బాలకృష్ణ రూ. 25 లక్షలు ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. ఇక ఇప్పటికే బాలకృష్ణ కుమార్తె మరియు హెరిటేజ్ సంస్థల సీఈవో నారా బ్రాహ్మణి రూ.66 లక్షలు ప్రకటించి అందరికంటే ముందున్నారు.
అయితే అంతటితో ఆగకుండా తమ సంస్థ తరపున శ్రీకాకుళంలోని ఒక 10 గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు నేడు ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆమె ప్రకటనను చూసిన పలువురు సినీ ప్రముఖులు మరియు సాధారణ ప్రజలు బ్రాహ్మణి ఔదార్యం ఫై విపరీతంగా పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. ఇకపోతే ఈ విషయంపై మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, సింహం కడుపున సింహమే పుడుతుంది అన్నట్లుగా, బాలకృష్ణ గారి అమ్మాయి బ్రాహ్మణి ఈ విధంగా తుఫాను ప్రభావిత ప్రాంతంలోని 10 గ్రామాలను దత్తతు తీసుకుని అభివృద్ధి చేయాలనుకోవడం, నిజంగా అద్భుతమని,  ఆమె లాంటివారు ఎందరికో ఆదర్శమని ట్వీట్ చేసారు.
మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా శ్రీకాకుళం లో పర్యటించి, రామ్ చరణ్ వంటివారు ముందుకురావాలని, ఇక్కడ ఒక గ్రామాన్ని దత్తతు తీసుకోవాలని కోరడంతో, వెంటనే స్పందించిన రామ్ చరణ్ తాను బాబాయ్ సూచనమేరకు అతిత్వరలో శ్రీకాకుళంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితి చూస్తుంటే, ఇలా అందరు ప్రముఖులు ముందుకు వచ్చి తుఫాను బాధితులను ఆదుకోవాలనుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయమని, వారి స్పూర్తితో మరికొందరు ముందుకు వచ్చి శ్రీకాకుళం, విజయనగర తుఫాను బాధితులను ఆదుకుంటే, అక్కడి ప్రజలకు చాలావరకు ఊరటగా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు….