తిత్లీ తుఫాను సృష్టిస్తున్న విధ్వంసం తెలిస్తే షాక్ అవుతారు!

0
304

ఇటీవల కేరళలో విపరీతమైన వర్షాలు మరియు వరదల కారణంగా కేరళ రాష్ట్రం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో పలువురు ఇతర రాష్ట్రాల ప్రజలు మరియు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని, కేంద్ర ప్రభుత్వం సహా ఆ రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి విశేషంగా ముందకువచ్చి తమవంతుగా విరాళాలు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం విశాఖ, శ్రీకాకుళం ప్రాంతాల్లో అక్కడి ప్రజల్లో విపరీతమైన అలజడి సృష్టిస్తున్న తిత్లీ తఫాను అక్కడ ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే అక్కడ తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో అధికారులు వున్నారు. సముద్రం విపరీతంగా పోటెత్తుతుండడంతో మత్సకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, సహా ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ తిత్లీ భీబత్సమ్ సృష్టిస్తోందట. ప్రస్తుతం అధికారులనుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ తిత్లీ ప్రభావానికి ఇప్పటికే ముగ్గురికిపైగా చనిపోయారని, ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతంకాకుండా ప్రజలు ఎక్కడికక్కడ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇక ఇప్పటికే పలు రహదారులు, ప్రాంతాల్లో చెట్లు విరిగిపడడం, కొని రేకుల షెడ్డులు కూలడం,. విపరీతమైన ఈదురు గాలులతో పశువులు, పక్షాదులు కూడా భయపడుతున్నాయని తెలుస్తోంది. వీలున్నంతవరకు ప్రజలు ఎవరూ కూడా ఈ తుఫాను తాకిడికి బయటకు రావద్దని, వారికీ అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ఎప్పటికపుడు చేస్తుందని, కావున ప్రజలు ఎవరు అధైర్యపడవద్దని అధికారులు చెపుతున్నారు. ఇక నిన్న రాత్రి నుండి సీఎం చంద్రబాబు నాయుడు, తిత్లీ ప్రభావిత ప్రాంతాలపై దృష్టిపెట్టి అక్కడి పరిస్థితిని ఎప్పటికపుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తుఫాను తీరం దాటిందని, దీని ప్రభావంతో రానున్న కొన్ని గంటలు మరింత తీవ్రంగా ఉండేఅవకాశం ఉండనుందని సమాచారం. ప్రస్తుతం తన ప్రకోపాన్ని చూపుతున్న తిత్లీ విశాఖ మరియు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఇంకెన్ని అలజడులు సృష్టిస్తుందో అని ప్రజలు భయకంపితులు అవుతున్నారు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here