తిత్లీ ధాటికి నాశమైన 8 మండలాలు ఏవో తెలిస్తే కన్నీళ్లాగవ్

0
156
ఇటీవల నాలుగేళ్ళ క్రితం విశాఖను, ఆ ప్రాంత ప్రజలను వణికించి, తీవ్ర నష్టాన్ని మిగిల్చిన హుద్ హుద్ తుపాను భీభత్సాన్ని అక్కడి ప్రజలు మరిచిపోలేదు. అయితే ఇక ప్రస్తుతం విశాఖ మరియు ఆ చుట్టుప్రక్కల జిల్లా వాసులను మరొక తుఫాను భయాందోళనలకు గురి చేస్తోంది.  అదే తిత్లీ, ప్రస్తుతం రెండు రోజులుగా ఈ తుఫాన్ ధాటికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ వంటి ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలను వణికించేస్తోంది. నేటి ఉదయం  శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం, పళ్ళేసారధి ప్రాంతం వద్ద ఈ తిత్లీ తీరాన్ని దాటింది. ఆ సమయంలో విజయనగరం, శ్రీకాకుళంలోని కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా దాదాపు 130 కిలోమీటర్లు మేర ఈదురు గాలులు, భారీ వర్షాలు పడుతున్నాయి. అంతేకాక ఆ గాలుల ధాటికి కొన్ని ప్రాంతాల్లో చెట్లు, చేమలు, ఇళ్ల రేకులు విరిగిపడడం వంటివి జరుగుతుండడంతో అధికారులు ప్రజలను ఇళ్ల నుండి బయటకు రావద్దని, తుఫాను బలహీన పడేవరకు కాస్త ఓపికపట్టాలని ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇకపోతే ఇప్పటికే తుఫాను ధాటికి మొత్తం ఎనిమిది మందికిపైగా చనిపోయారని అధికారులు చెపుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు, మరియు విజయనగరం జిల్లాలో ముగ్గురు ఈ గాలులు మరియు భీభత్సం ధాటికి ప్రాణాలు వదిలారట. ఇక విశాఖ రైల్వే స్టేషన్ లోరైళ్లు మరియు ఎయిర్పోర్ట్ లో విమానాలను ఎక్కడికక్కడ అధికారులు నిలిపివేశారు. ఇకపోతే ముఖ్యంగా ఈ తుఫాను ధాటికి శ్రీకాకుళంలోని ఎనిమిది మండలాలు తీవ్రంగా నాశనమైనట్లు తెలుస్తోంది. అవి  ఏవంటే, వలస కోటబొమ్మాలి, గారా, సోంపేట, ఇచ్చాపురం, , కవిటి, మందస, వజ్రపుకొత్తురు, సంతబొమ్మాలి మండలాలలో తీవ్ర నష్టం ఏర్పడి అక్కడి పంటలు మరియు జీడి, మామిడి తోటలకు తీవ్రనష్టం జరిగింది. ఇక తుఫాను నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తూ, ముందస్తు సమాచారం కోసం కాల్ సెంటర్లను ఏర్పాటు చేసారు. ఇక రేపు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జరగవలసిన ఇంటర్ హాఫ్ ఇఎర్లీ ఎగ్జామ్స్ ని వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయ లక్ష్మి ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఉగ్రరూపం దాల్చి, తన ప్రకోపాన్ని చూపుతున్న తిత్లీ ఇంకెన్ని బీభత్సాలు సృష్టిస్తుందో అని ప్రజలు భయపడుతు న్నారు.