త్రివిక్రమ్ ఇంక నువ్వు సినిమాలు తీయకు సామీ అంటున్న ఎన్టీఆర్ ఫాన్స్!

0
346

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అరవింద సమేత సినిమాపై టాక్ ఒకరకంగా మిశ్రమంగా వినపడుతోంది అనే చెప్పుకోవాలి. నిజానికి మార్నింగ్ బెనిఫిట్ షోను చూసిన ఎన్టీఆర్ ఫాన్స్, త్రివిక్రమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు పన్నెండు ఏళ్లపాటు మా హీరో మరియు మీ కాంబినేషన్లో మూవీ కోసం ఎదురు చూసాము, అయితే మీరు మాత్రం మా ఫ్యాన్స్ కి ఈ సినిమాతో ఏ మాత్రం తృప్తిని ఇవ్వలేదు అని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు వినికిడి. సినిమాలో ఎక్కువగా సెంటిమెంట్ మరియు ఎమోషన్ కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చారని, మిగతా ఎంటర్టైన్మెంట్ మరియు కామెడీ అంశాలపై సినిమాలో దృష్టి పెట్టలేదని వారు అంటున్నారు. ఇకపోతే సినిమాలో యాక్షన్ పార్ట్ గురించి విడుదలకు ముందు ఎన్నో అంచనాలు పెట్టుకున్నాం అని, అయితే నేడు చూసిన బెనిఫిట్ షో మాత్రం ఆ విషయంలో కూడా మమ్మల్ని చాలా నిరాశపరిచిందని వారు విమర్శిస్తున్నారు. ఇక ఆడియో రిలీజ్ అయినపుడు కూడా పాటలు ఎన్టీఆర్ వంటి ఒక స్టార్ హీరో రేంజ్ లో పాటలు లేవని తాము మొదట్లోనే అన్నాం అని, అయితే సినిమాలో పాటలు అద్భుతంవుంటాయి చూడండి అంటూ తమలో మరిన్ని ఆశలు రేకెత్తించారని చెప్తున్నారు.

ఇక ముఖ్యంగా సినిమాలో కేవలం ఎమోషన్ కె పెద్ద పీట వేసి, చాలావరకు త్రివిక్రమ్ మార్క్ పంచులు మిస్ చేసారని ఆరోపిస్తున్నారు. మేము అనుకున్న ప్రకారం త్రివిక్రమ్ గారు అన్నివర్గాలను ఆకట్టుకునేలా సినిమా తీస్తారని అనుకున్నాం, కానీ ఈ అరవింద సమేత సినిమా మాత్రం ఎమోషనల్ సినిమాలను కోరుకునేవారిని మాత్రమే ఆకట్టుకునేలా ఉందని, సినిమాకు అసలు త్రివిక్రమ్ గారే దర్శకత్వం వహించారా, అని కూడా ఒక సందర్భంలో మాకు అనిపించిందని వారు చెప్పుకొచ్చినట్లు సమాచారం. అందుకే ఇకపై మీరు సినిమాలు తీయండి, కానీ మా హీరోతో మాత్రం ఎప్పటికీ తీయకండి అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. దీన్నిబట్టి చూస్తుంటే, ఎన్టీఆర్ ఫాన్స్ అరవింద సమేత పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అయితే అరవింద సమేత సినిమా వారి అంచనాలను మాత్రం అందుకోవడంలో విఫలమైందని తెలుస్తోంది……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here