త్రివిక్రమ్ నన్ను మోసం చేసాడు అంటున్న రామ్ చరణ్!

0
350
టాలీవుడ్ లో ఎందరు దర్శకులు ఉన్నా కానీ, వారందరిలో ఎక్కడో ఒక్కరో ఇద్దరికో ఒకింత ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అటువంటి వారిలో అప్పట్లో దివంగత జంధ్యాల గారు ముందువరుసలో ఉంటారని చెప్పుకోవాలి. జంధ్యాల మార్కు సినిమాలు, హాస్యసన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయంటే అర్ధం చేసుకోవచ్చు అయన ఎంత గొప్ప దర్శకులో అని. ఇక ప్రస్తుతం జంధ్యాల వలె కొంత వైవిధ్యంతో వెరైటీగా డైలుగులు రాస్తూ, దర్శకత్వం వహించే దర్శకుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే చెప్పుకోవాలి. ఇకపోతే నువ్వే నువ్వే తో మొదలైన త్రివిక్రమ్ దర్శకత్వ ప్రయాణం ప్రస్తుతం అరవింద సమేత వరకు సాగింది. మరొక రెండు రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే తార స్థాయికి చేరాయి.
నిజానికి ప్రేక్షకుల్లో త్రివిక్రమ్ సినిమా వస్తుందంటేనే ఒక ఉత్సాహం, అందునా ఎప్పటినుండో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కంబినేషన్ లో సినిమాకొసం అందరూ ఎదురు చూపులు చూస్తుండడంతో ఈ హైప్ మరింత పెరుగుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి వినపడుతున్న ప్రీ రిలీజ్ రిపోర్టులను బట్టి చూస్తుంటే, సినిమా మంచి హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. సినిమాలో అంతర్లీనంగా మంచి సందేశం ఉన్నప్పటికీ, అటు త్రివిక్రమ్ స్టైల్, అటు ఎన్టీఆర్ స్టైల్ అంశాలు మాత్రం సినిమాలో అస్సులు మిస్ అవ్వవట. ఇకపోతే పాటలు మొదట్ల అంతగా అలరించలేదు, అయితే మెల్లగా ఒక్కొక్కపాట కూడా మంచి హిట్ అవడం, అందులో పెనివిటి సాంగ్ సూపర్ హిట్ అవడంతో ఆ పాట సినిమాలో చూడాలని ఎన్టీఆర్ ఫాన్స్ అతృతతో ఎదురు చూస్తున్నారు.
ఇక మరోవైపు తనతో త్రివిక్రమ్ సినిమా చేయకపోవడం పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత అలకబూనినట్లు సమాచారం. నిజానికి అరవిందకు సూపర్ హిట్ రిపోర్ట్స్ వస్తుండడం, ఇక మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, వంటి సూపర్ స్టార్స్ తో సినిమాలు చేసిన త్రివిక్రమ్, తనతో మాత్రం సినిమా చేయలేదని, నాతో ఎప్పుడు సినిమా చేస్తారని ఆయన్ని అడిగారట. అయితే మంచి కథ రాయగానే అది మీకు విన్పిస్తానని, త్వరలోనే వాటి కార్యక్రమాలు మొదలెడతానని కూడా త్రివిక్రమ్ మతిచ్చారట. దీన్ని బట్టి చూస్తుంటే,  టాలీవుడ్ లో గురుజీగా చెప్పుకునే త్రివిక్రమ్ గారితో సినిమా చేయాలని కేవలం చరణ్ కి ఏంటి, ఏ హీరోకి మాత్రం ఉండదు చెప్పండి…….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here