దేవదాస్ తొలిరోజు కలెక్షన్లు చూస్తే షాక్ అవుతారు!

0
333

కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని హీరోలుగా భలే మంచి రోజు, శమంతకమణి సినిమాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన లేటెస్ట్ మల్టి స్టారర్ మూవీ దేవదాస్. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసిందనే చెప్పాలి. ఇక మంచి అంచనాలతో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజు కొంత నెగటివ్ టాక్ తెచ్చుకుంది. కొందరు ఈ సినిమా పర్వాలేదనిపించేలా ఉందని అంటుంటుంటే, మరికొందరు మాత్రం సినిమా తమ అంచనాలను అందుకోలేకపోయింది అంటున్నారు.

ఇక నిన్న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్ లలో విడుదలయిన ఈ సినిమాకి తొలిరోజు అందరికి ఆశ్చర్యం కలిగించేలా కలెక్షన్లు వచ్చాయట. ప్రస్తుతం విడుదలైన సినిమాలలో ఏ సినిమా కూడా అంత సక్సెస్ఫుల్ గా రన్ కాకపోవడంతో ఈ సినిమాకి తొలిరోజు మంచి కలెక్షన్లే వచ్చాయట. ఇక ట్రేడ్ ఎనలిస్టులు చెపుతున్న వివరాల ప్రకారం ఈ సినిమాకి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.10 నుండి రూ.12 కోట్లవరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు వారు అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాకి మంచి కలెక్షన్లే వచ్చాయని, అయితే తొలిరోజు కొంతవరకు నెగటివ్ టాక్ రావడంతో రెండవ రోజునుండి ఈ సినిమా పరిస్థితి ఎలా వుండనుందో తెలియాలంటే ఇంకొద్దిరోజులు ఓపికపట్టాల్సిందే అని వారు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here