నయనతార ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉందని తెలిస్తే షాక్ అవుతారు!

0
231
మలయాళ సినిమా మనసిక్కరే తో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన నాయనతార ఆ తరువాత చంద్రముఖి సినిమాలో ఏకంగా సూపర్ స్టార్ రజిని సరసన అవకాశాన్ని కొట్టేయడం, ఇక ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో కోలీవుడ్ లో నయన్ కు మంచి అవకాశాలు దక్కాయి. అయితే ఆ తరువాత ఆమె సూర్యతో చేసిన ఘజిని, తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన లక్ష్మి, ప్రభాస్ సరసన బిల్లా వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. నయనతార ప్రస్తుతం కోలీవుడ్ లో ఒక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అయితే ఆమె పర్సనల్ లైఫ్ మాత్రం కొంత విచిత్రంగా సాగిందని చెప్పాలి. మొదట్లో డాన్సర్ కం నటుడు అయిన ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపిన నయనతార, ఆయనకు పెళ్లి అయి భార్య ఉన్నప్పటికీ కూడా ఆ సంబంధాన్ని కొన్నాళ్ళు కొనసాగించి అప్పట్లో పలు విమర్శలు ఎదుర్కొంది. ఇక ఆ తరువాత ప్రభుదేవా భార్య రమాలత్, ఈ విషయమై తనకు విడాకులు ఇవ్వకుండా ప్రభు, నయన్ తో కలిసి ఉంటున్నాడు అంటూ కోర్ట్ కి వెళ్లడంతో కోర్ట్ రమకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది హై కోర్ట్. ఇక ఆ తీర్పుతో ప్రభు, నయన్ లు విడిపోయారు.
అయితే ఆ తరువాత ఆమె యంగ్ హీరో శింబు తో కొన్నాళ్ళు ప్రేమాయణం జరిపింది. అతనితో డేటింగ్ లో వున్న సమయంలో ఇద్దరిమధ్య కొన్ని మనస్పర్థలు రావడంతో ఇద్దరు ఒకరినుండి మరొకరు విడిపోయారు. ఇకపోతే ఆమె వెంకటేష్ తో కలిసి ఇటీవల బాబుబంగారం అనే సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆమె రోజూ కూర్చునే కూర్చి పై మిస్సెస్ కురియన్ రాసి ఉండడం అందరూ గమనించారు. నిజానికి అంతకముందు ఆమె విగ్నేష్ కురియన్ తో నేను రౌడీని సినిమా చేసి వున్నారు. ఆ సమయంలో ఇద్దరు ఒకరిపై మరొకరు ప్రేమని పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వారిద్దరూ ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లడం, కలిసి తాము దిగిన ఫోటోలను షేర్ చేయడం చేస్తున్నారు. మరి ఇతడిని అయినా నయన్ చివరికి పెళ్లి చేసుకుంటుందా లేక, వదిలేస్తుందా అంటూ పలురకాల కథనాలు కోలీవుడ్ మీడియాలో పుకార్లుగా షికారు చేస్తున్నాయి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here