నాగబాబు జబర్దస్త్ కి రాకపోవడానికి అసలు కారణం బయటపెట్టిన ఆయన భార్య….కారణం తెలిస్తే షాక్ అవుతారు!

0
94
ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న షోలలో మంచి క్రేజ్ మరియు వీక్షకుల అభిమానంతో దూసుకుపోతున్న షో జబర్దస్త్. ఇక ఈ షో ప్రారంభమైన తరువాత ఆ ఛానల్ వారికి చాలావరకు రేటింగ్ కూడా పెరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇందులోని స్కిట్స్ వేసే నటులకు మాత్రమే కాదు, ఆ షోకి జడ్జీలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజాలకు కూడా మంచి పేరు వచ్చింది. నిజానికి మెగాస్టార్, పవర్ స్టార్ లకు సోదరుడైన నాగబాబు మన తెలుగువారందరికీ సుపరిచితమే అని చెప్పుకోవాలి. అయితే అయన చిరంజీవి, పవన్ లతో పోలిస్తే ఎక్కువగా సినిమాల్లో చేయనప్పటికీ ఆయనకు ప్రేక్షకుల్లో మంచి పేరుంది. ఇక ఇటీవల అయన గీత గోవిందం, అరవింద సమేత సినిమాల్లో తననటనకు గాను మంచి పేరు గడించారు. ఇక ఆయనవంటి మంచి గుర్తింపు వున్న నటుడైతే షోకి క్రేజ్ కూడా పెరుగుతుందని భావించిన ఈటివి యాజమాన్యం, జబర్దస్త్ షో ప్రారంభ సమయంలోనే ఆయనను ఒక జడ్జిగా తీసుకున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే గతకొద్ది  రోజులుగా నాగబాబు జబర్దస్త్ షోకి రావడం లేదు.

అయన రాకపోవడంపై పలురకాల కథనాలు మీడియా వేదికల్లో షికారు చేస్తున్నాయి. అయితే నిజానికి అయన షోకి రాలేకపోవడానికి గల అసలు కారణాన్ని అయన భార్య పద్మజ నేడు మీడియాకి వివరించినట్లు తెలుస్తోంది. నిజానికి నాగబాబుకు గతకొద్దిరోజులుగా సినిమా షూటింగులు ఉంటున్నాయని, వాటితో ఫుల్ గా బిజీ గా ఉండడం ఒక కారణం అయితే, అలా వరుసగా తీరిక లేకుండా షెడ్యూల్స్ ప్రకారం సినిమా షూటింగ్ లకు హాజరవుతున్న అయన ఆరోగ్యం ప్రస్తుతం కొంత బాలేదని, డాక్టర్లను సంప్రదించగా ఆయనను పరీక్షించి, కొద్దిరోజులు ఆయనను ఇంటివద్దనే వుండి రెస్ట్ తీసుకోవాలని సూచించారట. అందువల్ల ఆయన మరికొద్దిరోజులు ఇంటివద్దనే ఉంటారని, ఆరోగ్యం కొంత కుదుటపడ్డాక మళ్ళి తిరిగి జబర్దస్త్ షూటింగ్ లో యధావిధిగా పాల్గొంటారని చెప్తున్నారు పద్మజ. ఇక ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు నెటిజన్లు ఆయనపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.