నాగబాబు బర్త్ డే కి చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!

0
325
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన బడా ఫ్యామిలీస్ లో మెగా ఫ్యామిలీ ఒకటి అనే చెప్పుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని నిన్న మొన్నటి అల్లు శిరీష్ వరకు వారి కుటుంబ హీరోల ప్రస్థానం ఇప్పటికీ సాగుతూనే వుంది. ఇకపోతే నేడు మెగా బ్రదర్ మరియు మంచి మనసున్న మనిషి నాగబాబు గారి 57వ జన్మదినం. 1961 అక్టోబర్ 29న జన్మించిన నాగబాబు, తన అన్న చిరంజీవిగారి అడుగుజాడల్లో నడిచినప్పటికీ మొదటినుండి సినిమాలు తక్కువే చేసారు. అయన హీరోగా చేసిన సినిమాలు ఉన్నప్పటికీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పోషించిన పాత్రలే ఎక్కువ అని చెప్పుకోవాలి. ఇక నాగబాబు మొదటి నుండి కొంత మితభాషి అనే చెప్పుకోవాలి. అయితే ఇటీవల ఒక ఆడియో వేడుక సందర్భంగా మెగా ఫాన్స్ అందరూ పవన్ కళ్యాణ్ అంటూ అరుస్తుంటే, ఒక్కసారిగా స్టేజి పైకి వచ్చిన నాగ బాబు, వాడు మీకు హీరో కాక ముందే మాకు తమ్ముడు, తాను ఎక్కడ వున్నా, ఎప్పటికీ నాకు, చిరంజీవిగారికి గుండెల్లోనే ఉంటాడు అని ఆవేశంగా ప్రసంగించిన మాటలు మెగాఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు.
ఇక ప్రస్తుతం ఆయన కుమారుడు వరుణ్ తేజ్ ఓవైపు హీరోగా దూసుకెళ్తుంటే, మరోవైపు అయన కుమార్తె నిహారిక కూడా హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఇకపోతే నేడు నాగబాబు పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, తమ్ముడు నాగబాబు ఇంటికివెళ్లి ఆయనను బొకే తో విష్ చేసి, ఒక అద్భుతమైన బహుమతినిచ్చారట. ఇక ఆ బహుమతి బెంజ్ కారు అట. నిజానికి నాగబాబుకు కార్లు అంటే పెద్దగా ఇష్టం లేనప్పటికి, తనకు ఎప్పటినుండో ఒక బెంజ్ కారు తీసుకోవాలని ఉందని, అది తెలుసుకున్న చిరంజీవి ఒక లేటెస్ట్ మోడల్ బెంజ్ కారును అయన బర్త్ డే కి కానుకగా ఇచ్చి ఆశ్చర్యపరిచారట. ఇకపోతే ఆ గిఫ్ట్ చూసిన నాగబాబు మరియు వరుణ్ తేజ్ లు విపరీతమైన సంతోషంగా వున్నారని, ఇక నేడు ఆయన జన్మదిన వేడుకలు సాదాసీదాగా వారి కుటుంబసభ్యుల మధ్య జరగనున్నాయని సమాచారం అందుతోంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here