నాగుపాముతో కాపురం చేసి తల్లైన అమ్మాయి…..మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు!

0
414
మనిషి జీవితంలో ఊహించని, ఊహకి అందని ఎన్నో అద్భుతాలు జరగడం మనం అక్కడక్కడా వింటుంటాం. ఇక మనలో చాలామందికి పాములు అంటే భయం ఉంటుంది. అందులో కొందరు పాములను ఒక సాధారణ జంతువులుగా భావిస్తే, మరికొందరు మాత్రం పాములు కూడా పగ పడతాయని, సర్పాన్ని కూడా ఒక దేవతవలె భావించి, ఆ నాగుపాములకు పూజలు చేయడం కూడా చాలావరకు చూస్తుంటాం. ఇక మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఒక ఘటన వింటే మాత్రం అందరికి ఆశ్చర్యం కలుగక మానదు. ఇక విషయం ఏమిటంటే, ఒక స్త్రీ ఒక కాళసర్పంతో కలిసి సంసారం చేసి, బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ ఘటన ఇప్పుడు జరగలేదు, పూర్వం దాదాపు 200 ఏళ్ళ క్రితం కర్ణాటక ప్రాంతంలోని ఒక మారుమూల కుగ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో జరిగింది. ఆ కుటుంబంలోని దంపతులకు అప్పన్న అనే కొడుకు ఉండేవాడు, మంచి తనంలో దిట్ట, మానవత్వంతో తనకు తానే సాటి, అయితే అతనికి ఒకేఒక దురలవాటు మాత్రం ఉండేది. అదే అమ్మాయిల పిచ్చి. తాను రోజూ ఏదో ఒక వ్యభిచారితో గడపనిదే అతనికి నిద్దుర పట్టదు.
అతని వ్యసనాన్ని తెలిసిన ఊళ్ళోవాళ్ళు అందరూ, అప్పన్న తల్లితండ్రులను మందలిస్తూ, అతడికి పెళ్లి చేస్తే ఆ వ్యసనం పూర్తిగా పోతుందని చెప్పడంతో, తమకు తెలిసిన ఒక కుటుంబంవారితో సంబంధం మాట్లాడి సాకి అనే అమ్మాయితో అప్పన్న పెళ్లి నిశ్చయించి పెళ్లి చేస్తారు. అయితే పెళ్లి అయిన రోజునుండి తన భార్యను కనీసం తాకని అప్పన్న, యధావిధిగా వేశ్యల దగ్గరకు వెళ్లడం కొనసాగించాడట. అయితే ఈ విషయాన్నీ గ్రహించిన భార్య, తన పరిస్థితిపై రోజూ ఆందోళన చెందుతుండగా, వారి ఇంటి పక్కనే వుండే ఒక ముసలావిడ తనకు తెలిసిన ఒక మంత్రగాడి దగ్గరకు వెళ్లి, ఒకరకమైన వశీకరణ భస్మాన్ని తెచ్చి సాకి కి ఇచ్చిందట. ఈ భస్మాన్ని నీ భర్త తాగే పాలల్లో కలిపి ఇవ్వు, అతడు ఎప్పటికి నీవాడై ఉండి, నీ కొంగు పట్టుకుని తిరుగుతాడు అని చెప్పిందట.
అయితే ఒకరోజు ఆ భస్మాన్ని అప్పన్న తాగే పాలల్లో కలిపి ఇవ్వగా, నేను ఈ రోజు పాలు తాగను, అంటూ ఆ పాల చెంబును అక్కడే వదిలేస్తాడు అప్పన్న. అతను తగ్గకపోవడంతో కాసేపటికి పాలు తీసుకెళ్లి బయట ఒక చోటపారబోస్తుంది సాకి. ఆశ్చర్యంగా ఆ పాలను ఒక దేవతా పాము తాగి, సాకి పై మొహంతో అప్పన్న రూపంలో ఆ రోజునుండి, ఆమె వద్దకు రోజూ రాత్రి వేళ వస్తుండేది. కొన్నాళ్ళకు సాకీ పై అప్పన్నకు అనుమానం కలిగి ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసి ప్రతిరోజు బయటకి వెళ్తుండేవాడు. అయినప్పటికీ ఇంటి కిటికీ ద్వారం నుండి వచ్చిన ఆ పాము, అప్పన్నలా మారి రాత్రులు వస్తూ సాకితో సంసారం చేస్తూ ఉండేదట. కొన్నాళ్ళకు సాకి గర్భం దాల్చడంతో అసలు విషయం బయటకు రావడంతో,
సాకీని కొడతాడు అప్పన్న, ఈ విషయం ఊరి పెద్దల వద్దకు చేరడంతో, చివరికి రాత్రులు వచ్చేది అప్పన్న కాదని తెలుస్తుంది. అయితే అనుకోకుండా అక్కడకు వచ్చిన దేవతా సర్పం, తానే రోజు రాత్రులు సాకి వద్దకు అప్పన్న రూపంలో వచ్చేవాడిని అని, ఒకానొక సమయంలో సాకి పోసిన పాలు తాగిన తాను సాకి ప్రేమకు బానిసనయి ఆమెను వదలలేక వచ్చానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. కొన్నాళ్ళకు సాకి ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ఈ విధంగా సర్పం ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన ఆ అమ్మాయి కథ ఇప్పటికీ ఆ ప్రాంతంలో ప్రసిద్ధి అట…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here