నిందితుడి జేబులో లెటర్? ఆ లెటర్ లో ఏముందంటే?

0
192
నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైసిపి అధినేత జగన్ పై దాడి కేసు ఘటన విపరీతంగా సంచలనం సృష్టిస్తోంది. నిజానికి జగన్ తన ప్రజాసంకల్ప యాత్ర ముగించుకుని విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకోగానే, అక్కడి క్యాంటీన్ లో కొద్దిపాటి అల్పాహారం తిన్నారని, అయితే అది అయిన వెంటనే ఆ క్యాంటీన్ లో పనిచేసే శ్రీనివాస్ అనే యువకుడు జగన్ వద్దకు వచ్చి, సర్ మీతో నాకు సెల్ఫీ కావలి అంటూ అడగడం, ఆపై జగన్ అతనితో సెల్ఫీ కి ఉపక్రమించడం, వెంటనే అతడు చిన్న కత్తితీసి జగన్ పై దాడికి యత్నించడం అలా చూస్తూవుండగానే జరిగిపోయాయి. అయితే ఈ దాడి తరువాత నిందితుడిని అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది అతడిని పోలీసులకు అప్పగించారు.
అనంతరం జగన్ ని అక్కడి డాక్టర్లు ప్రధమ చికిత్స అందించారు. అయితే నిజానికి నిందితుడు జగన్ గొంతు కోయాలని యత్నించాడని, అయితే అతడు ఎత్తిన కత్తి అయన భుజానికి తగలడం మంచిదయిందని, లేకపోతే అయన మెడకు బలమైన గాయం అయ్యేదని అక్కడి వారు చెపుతున్నారు. ఇక శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి పూర్వాపరాలను పరిశీలిస్తున్నారు. అయితే వారి విచారణ సమయంలో శ్రీనివాస్ వద్ద ఒక 8 పేజీల లెటర్ దొరికిందని, ఆ లెటర్ చూసిన పోలీసులు నిర్ఘాంతపోయారని అంటున్నారు. ఆ లెటర్ లో తనకు జగన్ పై అమితమైన ద్వేషమున్నట్లు అర్ధం అవుతోందని,
జగన్ వంటి నాయకుడు అధికారాన్ని చేపడితే రాష్ట్రం నాశనం అవుతుందని, అందుకే అతడు జగన్ ను అంతమొందించాలని ఆయనపై దాడి చేసాడని పోలీసులు చెపుతున్నారు. ఇక అంతేకాక ఒక ఇద్దరు టిడిపి నాయకుల పేర్లు కూడా ఆ లెటర్ లో ఉన్నాయని సమాచారం అందుతోంది. ఇక దీన్ని బట్టి చూస్తుంటే ఇది ఖచ్చితంగా టిడిపి నాయకుల పనేనని, వారే కావాలని జగన్ పై దాడి చేయించారని, ఇంతటి నీచమైన ప్రభుత్వానికి ప్రజలు రాబోయే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని వైసిపి మరియు బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు…..