నీలిమ బర్త్ డేకి గీత చేసిన పనికి షాక్ అయిన కౌశల్,ఏం చేసిందో తెలుసా?

0
387
ప్రస్తుతం తెలుగు వారి నోట ఎక్కువగా వినపడుతున్న పేరు కౌషల్. బిగ్ బాస్ లో విన్నర్ గా నిలిచిన కౌశల్, ఆ విజయంతో ఒక్కసారిగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక అయన టైటిల్ విన్నర్ గా నిలుస్తాడని మేము అందరము అనుకున్నాము. కానీ, ఎవరూ ఊహించని విధంగా కౌషల్ దాదాపు 40 కోట్ల ఓట్ల మెజారిటీతో కౌషల్ జైలుపొందడం నిజంగా మా అందరిని ఆశ్చర్యపరిచిందని అంటున్నారు మిగతా హౌస్ మేట్స్. హౌస్ లో ఉన్నపుడు మేము అందరము ఒకరకంగా ఫ్రెండ్ షిప్ కి, బంధాలకి విలువనిస్తే, మరోవైపు కౌశల్ మాత్రం మొదటినుండి గేమ్ ని ఒకేవిధంగా ఆడడంతోనే అతడు విజేతగా నిలవడానికి ముఖ్య కారణమని మిగిలిన హౌస్ మేట్స్ చెప్తున్నారు.
ఇక ఈ విషయం అటుంచితే, నేడు కౌషల్ భార్య నీలిమ బర్త్ డే కావడంతో  నా గెలుపుకు ఒక కారణమైన ఆమె ఎల్లప్పుడూ అలానే సంతోషంగా ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నట్లు కౌశల్ ఒక సెల్ఫీ వీడియో చేస్తూ చెప్పిన విషయం తెలిసిందే. ఇక నీలిమ బర్త్ డే ని పురస్కరించుకుని ఆమెకు బిగ్ బాస్ ఫైనలిస్టులలో ఒకరైన గీత మాధురి ఫోన్ చేసి విష్ చేసిందట. you are the great betterhalf for kaushal, many happy returns of the day, may god bless your couple. అంటూ చెప్పిందట. ఇక వూహించనివిధంగా గీత కాల్ చేయడంతో కౌషల్ దంపతులు ఆశ్చర్యపోయారని, తనకు బర్త్ డే విషెస్ చెప్పిన గీతకు అల్ ది బెస్ట్ చెప్పారట వారిద్దరూ. ఏది ఏమైనా ప్రస్తుతం కౌషల్ కు సంబందించిన ఏ చిన్న విషయమైనా కూడా హాట్ కేక్ లా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదంతా బిగ్ బాస్ టైటిల్ విన్ అయిన పుణ్యమే మరి, ఏమంటారు ఫ్రెండ్స్…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here