నేను కూడా సాయితేజ లా…. సంచలన నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ వినోద్!

0
202
కొన్నాళ్లనుండి ఈటివి లో ప్రదర్శితమవుతూ విపరీతమైన ప్రేక్షకాభిమానం మరియు అద్భుతమైన రేటింగ్స్ తో దూసుకెళ్తున్న షో జబర్దస్త్. హైపర్ ఆది మొదలుకుని, గెటప్ శ్రీను, అదిరే అభి, చమ్మక్ చంద్ర, ఇలా చెప్పుకుంటూపోతే ఎవరికి వారు ప్రేక్షకుల్లో తమకంటూ ఒక ఇమేజిని సంపాదించారు. ఇకపోతే జబర్దస్త్ లో స్త్రీ పాత్రలు వేసే నటులు కూడా మంచి ప్రేక్షకాదరణ పొందారు. అయితే వారిలో దాదాపుగా అందరూ మగవారే అనే విషయం తెలిసిందే. అయితే అందులో స్త్రీ పాత్రలు వేస్తూ పేరుగాంచిన సాయితేజ, ఇటీవల పూర్తిగా ప్రియాంక సింగ్ అనే అమ్మాయిగా మారాడు. ఇక కొన్నాళ్ళనుండి జబర్దస్త్ కార్యక్రమానికి మరియు మీడియాకి దూరంగా ఉంటూ వస్తున్న సాయితేజ రెండు రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని సంచలన విషయాలు చెప్పాడు.
నిజానికి తనకు తన సోదరి చిన్నప్పటికీ రకరకాల దుస్తులు వేసుకోవడం చూస్తే ముచ్చటేసేదని, అయితే అటువంటి దుస్తులు మరియు ఆభరణాలు తాను కూడా వేసుకోవాలని అనుకునే వాడిని అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు తనకు జబర్దస్త్ లో స్త్రీ పాత్రలు వేయడానికి అవకాశం రాగానే తాను లోలోపల చాలా ఆనందపడ్డానని అన్నాడు. ఇక కొద్దిరోజుల క్రితం ఒక ఆపరేషన్ ద్వారా తాను పూర్తిగా అమ్మాయిగా మారానని, ప్రస్తుతం పూర్తి అమ్మాయిగా మారిన తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. అయితే తనకు పర్సనల్ గా మాత్రం కొన్ని సమస్యలు ఉన్నాయని, నిజానికి తాను అమ్మాయిగా మారిన విషయం ఈ ఇంటర్వ్యూ ఇచ్చేవరకు తన కుటుంబసభ్యులు ఎవరికీ కూడా తెలియదని, మరి ఈ షో చూసిన వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో అని కొంత భయంగా కూడా ఉందని అన్నాడు.
అయితే ఈ విషయమై మీరు కూడా త్వరలో అమ్మాయిలా మారతారా అంటూ ఒక మీడియా సమావేశంలో జబర్దస్త్ ఫేమ్ వినోద్ ని విలేఖరి ప్రశ్నించగా, తాను మగవాడిని అని, కాగా తనకు జబర్దస్త్ లో అమ్మాయిగా అవకాశం వరించడం ఆనందంగా ఉందని, అంతేతప్ప తనకు సాయితేజ లా పూర్తిస్థాయి అమ్మాయిలా మారడం ఇష్టం లేదని గట్టిగా బదులిచ్చాడట వినోద్. ఇకపోతే తనకు త్వరలోనే పెళ్లి కూడా ఇంట్లోవాళ్ళు చేయబోతున్నారని, ఎవరో ఒకరు అమ్మాయిగా మారారు కదా అని, మీరు కూడా అలా మారతారా అంటూ మిగతావారిని అడగడం సరైనది కాదని మీడియావారిపై మండిపడ్డాడట. కాగా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తోంది…..