నేను వాడి సినిమా చూడను అంటున్న బాలకృష్ణ!

0
339

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అరవింద సమేత సినిమా నిన్న భారీ అంచనాల మధ్య విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. అయితే ఈ సినిమాపై కొంతమంది అద్భుతంగా ఉందని కితాబిస్తోంటే, మరికొందరు మాత్రం సినిమాపై మేము ఎన్నో అంచనాలు పెట్టుకున్నాము, ఓవర్ ఆల్ గా సినిమా బాగున్నప్పటికీ మేము సినిమాను ఒక బ్లాక్ బస్టర్ గా వూహించమని అయితే ఆ రేంజి లో సినిమాలేదని అంటున్నారు. ఇకపోతే ఇప్పటికే సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంశలు కురిపిస్తుంటే, ఎన్టీఆర్ బాబాయ్ అయిన నందమూరి బాలకృష్ణ ఈ సినిమాను చూడలేదని, అంతేకాదు తనకు సినిమా కూడా చూసే ఉద్దేశ్యం లేదని తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం. నిజానికి బాలకృష్ణ అలా అనడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందని, ఒకరకంగా బాలకృష్ణ గారికి త్రివిక్రమ్ వర్కింగ్ స్టైల్ చాలా ఇష్టమని, అంతే కాదు ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ అరవింద సమేత సినిమాను ఆయనకు చూడాలని ఎంతో ఆత్రంగా ఉన్నప్పటికీ,

ఇటీవల ఒక నెలన్నర క్రితం ఆయన అన్నగారైన హరికృష్ణ గారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురై అకాలమరణం చెందిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటన అరవింద సమేత సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో జరగడంతో, ఈ సినిమా చూస్తే తన అన్న హరికృష్ణ గారే తనకు గుర్తుకువస్తారని, అదీ కాక ఇది తండ్రి కొడుకుల అనుబంధానికి ఒకసారికొత్త భాష్యం చెప్పేలా రూపొందిన చిత్రం కావడంవల్ల బాలకృష్ణ కొంత మనోవేదనకు గురయ్యారని, ఒకరకంగా ఈ సినిమా చూస్తే తన అన్న గుర్తుకువస్తారనే తలంపుతోనే ఈ సినిమా అయన చూడలేదని అంటున్నారు. అయితే ఆయన సినిమా టాక్ విషయమై ఎంక్వయిరీ చేయగా, సినిమా బాగుందని టాక్ వచ్చిందని, ఆ టాక్ విన్న తనకి నిజంగా చాలా సంతోషం వేసిందని, టాక్ వినగానే బాలయ్య, ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ లకు శుభాకాంక్షలు కూడా చెప్పారట. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here