నైటీ వేసుకోవద్దన్న అజ్ఞని ధిక్కరించినందుకు…. ఆ అమ్మాయికి ఎటువంటి శిక్ష వేసారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0
287

రెండు రోజులనుండి పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామంలో ఇకపై పగటిపూట మహిళలు నైటీలు వేసుకుని బయటకు రావడం విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే నిజానికి కొద్దిరోజుల క్రితం గ్రామంలోని డ్వాక్రా మహిళా సమావేశాల్లో అలానే కొన్ని జన్మభూమికి సంబందించిన సమావేశాల్లో కొందరు మహిళలు నైటీలు వేసుకుని పాల్గొనడంతో ఆగ్రహించిన అధికారులు ఆ విషయంపై స్థానిక పెద్దలకు కంప్లెయింట్ చేశారు. అనంతరం ఆ విషయంపై కొంత సుదీర్ఘంగా చర్చించిన గ్రామ పెద్దలు ఇకపై ఆడవారు పగటిపూట గ్రామంలో నైటీలు వేసుకుని బయటకు రాకూడదని గట్టిగా ఆజ్ఞలు జారీ చేశారు. అంతేకాదు ఒకవేళ ఈ ఆజ్ఞ ఎవరైనా దిక్కరిస్తే వారికి రూ.2000 జరిమానాతో పాటు వారిని గట్టిగా శిక్షిస్తామని గ్రామా పెద్దలు చెపుతున్నారు.

ఇక గ్రామంలో చాలామంది మహిళలు ఉదయం సమయంలో షాపులకు, హాస్పిటల్స్ కు మరియు అదే డ్రెస్సుతో బ్యాంకులు, వంటి కార్యాలయాలకు వెళ్తున్నారని, ఆ విధంగా వెళ్లడం వల్ల మిగతావారికి ఇబ్బంది కలుగుతుందని భావించి ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు చెపుతున్నారు. అయితే ఈ విషయమై నేడు అక్కడి తహశీల్ధార్, మరియు స్థానిక ఎస్సై ఆ ఊరి మహిళలను కొందరిని కలిసి నైటీల నిషేధంపై వారి వ్యక్తిగత అభిప్రాయం తీసుకున్నారట. అయితే ఈ విషయమై ఆగ్రహించిన కొందరు మహిళలు, అసలు తాము బట్టలు ఇలాంటివే వేసుకోవాలి, ఇలాంటివి వేసుకోకూడదు అంటూ నిషేధం విధించడానికి గ్రామ పెద్దలు ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారట. అంతేకాదు అసలు నైటీ ధరించిన స్త్రీ వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదని, పైగా చెప్తున్నవాదన వొట్టి కల్పితమని అన్నారు.

అయినా ఎందరో హీరోయిన్లు పొట్టి బట్టలు, చిరిగిన బట్టలు ధరిస్తే ఏ మాత్రం అడ్డుచెప్పని ఇటువంటి పెద్దలు, మేము ఎవరికి ఇబ్బంది కలిగించకుండా నైటీలు వేసుకుంటే ఎందుకు తప్పులు ఎంచుతున్నారని ఆగ్రహిస్తున్నారు. మాపై ఇటువంటి పిచ్చి పిచ్చి నియమాలు పెట్టి, మహిళల హక్కులను కాళరాయడం తగదని, కావున వెంటనే ఈ నిబంధనను వెంటనే గ్రామపెద్దలు ఉపసంహరించుకోవాలని అన్నారట. అయితే నేటి ఉదయం, ఒక స్థానిక అమ్మాయి నైటీ వేసుకుని బయటకు రాగానే, ఇలా ఎందుకు వచ్చావు, మా ఆజ్ఞలపై నీకు విలువలేదా అంటూ ఊరిపెద్ద ఒకరు ఆమెపై దురుసుగా ప్రవర్తించి, ఆమెకు రూ.2000 ఫైన్ వేసి, అంతటితో ఆగకుండా ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని షాపుల్లో అమ్మే నైటీలను బయటకు తెచ్చి వాటిని తగులబెట్టారట. ఇక ఈ ఘటనతో ఆ ఊళ్ళో కొంత ఆందోళన చెలరేగిందని, ఇకపై ఇటువంటి ఘటనలు మరిన్ని జరుగకుండా గట్టి పోలీస్ భద్రత కల్పించనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here