‘నోటా’ హిట్టా ఫట్టా? ఫస్ట్ షో టాక్ వింటే దిమ్మతిరుగుతుంది ?

0
369
పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ లో మంచి హిట్ అందుకుని, ఆ తరువాత అర్జున్ రెడ్డి బంపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఇక ఆ సినిమా హిట్ తరువాత విజయ్ కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే అక్కడినుండి విజయ్ మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక ప్రస్తుతం అయన హీరోగా నటిస్తున్న సినిమా నోటా. తొలిసారి అయన ద్విభాషా చిత్రం గా చేస్తున్న నోటా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ ఎలా ఉందొ తెలుసుకుందాం. ఇక ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్లు, ఇదిఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగె సినిమా అని చెప్పకనే చెపుతున్నాయి.
ఇక నేటి మార్నింగ్ షో చూసిన వారినుండి అందుతున్న సమాచారం ప్రకారం, సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం కొంత పర్వాలేదనిపించేలా ఎంటర్టైనింగ్ గా సాగుతుందట. ఇక మధ్యలో వచ్చే పాటలు అంతగా ఆకట్టుకోవని, సంగీత దర్శకుడు సామ్, మరింత అలరించేలా ట్యూన్స్ అందిస్తే బాగుండేదని అంటున్నారు. ఇకపోతే ప్రీ ఇంటర్వెల్ టైం లో వచ్చే సీన్స్ బాగున్నాయని, దానితో మూవీలోని సెకండ్ హాఫ్ పై ప్రేక్షకుడికి మరింత ఆసక్తి పెరుగుతుందని టాక్. ఇకపోతే కాస్త చప్పగా మొదలైన సెకండ్ హాఫ్, చాలావరకు అలానే సాగుతుందట. అయితే సినిమాలో చివరి 40 నిముషాలు మాత్రం ప్రేక్షకుడిని కట్టి పడేస్తాయని అంటున్నారు.
ఇక ముఖ్యంగా యంగ్ సిఎం గా విజయ్ నటన బాగుందని, అయన పలికిన కొన్ని డైలాగ్స్ ప్రజలను ఆలోచింపచేస్తాయని చెపుతున్నారు. ఇక సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కు అంతగా గుర్తింపు ఇవ్వలేదని, మిగిలిన పాత్రలు వేసిన నాజర్, సత్య రాజ్ లు తమ పాత్రల పరిధిమేరకు బాగా నటించి ఆకట్టుకున్నారని అంటున్నారు. దర్శకుడు ఆనంద్ శంకర్ సినిమాను పూర్తిస్థాయిలో రాజకీయాలకే పరిమితం చేసి, సగటు ప్రేక్షకుడికి కావలసిన ఎంటర్టైన్మెంట్ ని మాత్రం మిస్ అయినట్లు తెలుస్తోంది. ఇక మొత్తంగా చెప్పుకోవాలంటే, పూర్తి స్థాయి పొలిటికల్ డ్రామాగా సాగుతూ, మధ్య మధ్యలో కొన్ని సరదా సన్నివేశాలు కలగలుపుకుని, చివర్లో కొద్దిపాటి ట్విస్టులతో సాగె ఈ ‘నోటా’ సినిమా ప్రస్తుతం వున్న విజయ్ క్రేజ్ ని బట్టి చూస్తే ఎబోవ్ యావరేజ్ సినిమాగా మిగిలే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే ఒకవేళ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినట్లు ఆ నోటా ఈ నోటా కనుక వినపడితే మాత్రం, సినిమా యావరేజ్ గా మిగులుతుందని ఈ ‘నోటా’ పై అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నోటా మూవీ పూర్తి స్థాయిలో ఏ రేంజ్ మూవీ గా నిలబడుతుందో తెలియాలంటే రెండు, మూడు రోజులు వేచిచూడవలసిందే మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here