నోటి దుర్వాసనతో అవకాశాలు పోగొట్టుకుంటున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

0
256
సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరో, హీరోయిన్లు తమ వ్యక్తిగత ప్రవర్తన మూలంగా కూడా తమ అవకాశం పోగొట్టుకుంటుంటారు. అటువంటివారిలో ఒకరు సహజ నటుడు కమల్ హాసన్ తనయ శృతి హాసన్ అని ప్రస్తుతం కొన్ని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. నిజానికి మొదటినుండి తండ్రి కమల్ అడుగుజాడల్లో పెరిగిన శృతి, ఎప్పుడూ అందరితో సరదాగా ఉంటుందని ఆమె సన్నిహితులు చెపుతుంటారు. మొదట లక్కీ అనే బాలీవుడ్ సినిమా ద్వారా సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్, ఆ తరువాత తమిళ తెలుగు భాషల్లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ కూడా ఆమెకు సరైన సక్సెస్ రాలేదు. ఇక ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా శృతి కెరీర్ ని మలుపు తిప్పింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమెకు ఆఫర్లు వెల్లువలా రావడం మొదలయ్యాయి. అయితే ఆ తరువాత ఆమె సూర్య, మహేష్ బాబు, ఎన్టీఆర్, బన్నీ, వంటి అగ్రనటులతో నటించి మంచి హిట్స్ అందుకుంది. ఇక అప్పట్లో ఆమె రానా, సిద్దార్ధ లతో కొంత ప్రేమాయణం నడిపినట్లు కొన్ని మీడియా వర్గాల్లో పుకార్లు షికారు చేశాయి.
అయితే ఆ తరువాత ఆమె లండన్ కు చెందిన ఒక వ్యక్తి తో డేటింగ్ లో వుంది అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇక ప్రస్తుతం శృతి పెద్దగా సినిమాలు లేక ఖాళీగా ఉందట. నిజానికి శృతి గురించి ఇప్పటివరకు బయటకు రాని ఒక విషయం ఉందని, అది తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారని అంటున్నారు. మ్యాటర్ ఏంటంటే, మొదటి నుండి పార్టీ కల్చర్ కి అలవాటు పడ్డ ఆమె, లేట్ నైట్స్ పార్టీల్లో సిగరెట్, మందు విపరీతంగా తాగి ఏ తెల్లవారుఝాముకో ఇంటికి వచ్చి పడుకుంటుందట. ఇక తెల్లారి షూటింగ్ ఉంటే, దాదాపుగా లంచ్ సమయానికి కానీ షూటింగ్ స్పాట్ కి రాదట. ఇక ఆ సమయంలో ఎలాగోలా తనకు ఇచ్చిన డైలాగులను హీరోతో కలిసి చెపుతుందని, అయితే ఆ సమయంలో నైట్ తాగిన మద్యం తాలూకు వాసన, ఆమె నోటి నుండి వస్తుంటుందని ఆమెతో నటించిన పలువురు హీరోలు తమ సన్నిహితుల వద్ద చెప్పేవారట. గబ్బర్ సింగ్, శ్రీమంతుడు సినిమాల షూటింగ్ ల సమయంలో పవన్, మహేష్ లు ఈ విషయమై ఆమె తాలూకు సీన్లు తెలివిగా మధ్యాహ్నానికి  మార్చేవారని, అప్పటికి ఆమె లంచ్ కూడా అయిపోవడంతో కాస్త ఆమె నోటి నుండి మద్యం వాసన రావడం తగ్గుతుందని అలాచేసేవారట.
ఇక బన్నీ వంటి హీరోలు కూడా ఆమె నోటి నుండి వచ్చే మద్యం వాసనతో ఎంతో ఇబ్బంది పడ్డాడట. ఇక ఈ విషయం కొందరు పెద్ద నిర్మాతలు, దర్శకుల వద్దకు కూడా చేరడంతో, వీలైనంత వరకు తమ సినిమాల్లో శృతిని తీసుకోకూడదనే నిర్ణయించారట. అందుకే ఆమెకు పూర్తిగా అవకాశాలు తగ్గాయని, అయితే ఈ విషయం ఇప్పటివరకు గోప్యంగా ఉంచగా, కొందరు మీడియా వ్యక్తుల ద్వారా ప్రస్తుతం ఇది బయటకు వచ్చిందని తెలుస్తోంది. కాగా శృతి గురించిన ఈ విషయం విన్న ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికల్లో ఆమెపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here