పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లులో గుడిలో ప్రాణాలు విడిచిన పూజారి….. షాక్ లో భక్తులు!

0
214
నిజానికి మన దేశంలోని మూడు పెద్ద మతాల్లో ఒకటైన హిందూ మతంలో మిగతా మతాలవలె కొన్ని నియమాలను ఎంతో నిష్టగా పాటిస్తారు అనేది తెలిసిందే. ఇక  ప్రస్తుతం హిందూ దేవుళ్లలో ఒకరైన ఆ పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన కార్తీమాస కాలం సాగుతోంది. ఇటువంటి సమయంలో చాలామంది హిందువులు, వేకువఝామునే నిద్రలేచి, స్నానమాచరించి, ఎంతో నిష్టగా ఆ మహాశివుడిని ధూప, దీప నైవేద్యాలతో శ్రద్ధగా ఈ మాసం మొత్తం పూజిస్తారు. అలా చేస్తే, లయ కారకుడైన ఆ శివుడు మనకు సకల శుభాలు, ఆయురారోగ్యాలు, మంచి సంపదలు అనుగ్రహిస్తాడని ప్రతీతి. ఇక ఈ మాసంలో ఎక్కువగా పశ్చిమ గోదావరి జిల్లా లో ప్రసిద్ధి గాంచిన పంచారామక్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో పని చేసే ప్రధాన అర్చకులు నేడు గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
ఇక ఈ విషయాన్ని విన్న పలువురు భక్తులు ఒకవేళ కొద్దిరోజులు ఆలయాన్ని మూసివేస్తారేమో అని భయపడుతున్నారు. నిజానికి నేడు కార్తీక శుద్ధఏకాదశి కావడంతో, శివుడిని సేవించవచ్చని వచ్చిన ఆ ఆలయ భక్తులకు ఈ వార్త కొంత మింగుడుపడలేదని సమాచారం. అయితే నిజానికి ఇటువంటి గొప్ప పర్వదినాన మరణించడం చాలా మంచిదని, అటువంటి వారి ఆత్మలు నేరుగా వైకుంఠానికి చేరి, ఆ శివుని అనుగ్రహాన్ని పొందుతారని అంటున్నారు. ఇకపోతే ఆ పూజారి మరణంతో గుడికి వచ్చిన  పెద్ద సమస్య ఎమి లేదని, కాకపోతే ప్రతిరోజూవలె నేడు కూడా పూజలు కొనసాగుతాయని, కాకపోతే అయన స్థానంలో మరొక పూజారి విధులు నిర్వహిస్తారని, ఇక నేటి సాయంత్రం కాసేపు ఆయనకు సంతాపంగా సమయాన్ని కేటాయిస్తామని ఆలయ అధికారులు చెపుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ వార్త అక్కడి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో విపరీతంగా వైరల్ గా మారింది. నిజానికి చావుపుట్టుకలు అనేవి మన చేతుల్లో ఉండేవు కాబట్టి, ఇటువంటివి అన్నీ కూడా ఆ పరమేశ్వరుడి లీలల్లో ఒకటని పలువురు భక్తులు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here