పవన్ కాన్వాయ్ పై దాడి టిడిపి పనేనా…..అనుమానం రేకెత్తిస్తున్న అనేక విషయాలు!

0
224
నిన్న రాత్రి తన ప్రజా పోరాట యాత్ర పూర్తి చేసుకుని రాజమండ్రి నుండి కాకినాడ బయల్దేరిన పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కి రాజంపేట వద్ద ఒక యాక్సిడెంట్ జరిగింది. అయితే ఆ యాక్సిండెంట్ లో పవన్ కళ్యాణ్ కు ఏమి కాలేదని, ఆ కాన్వాయ్ లో పవన్ వాహనానికి వెనుకవైపు వస్తున్న సెక్యూరిటీ వారి వాహనాన్ని అటుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టిందని తెలుస్తోంది. అయితే ఆ సమయంలో వ్యానులో వున్న ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది మరియు మరొక ఏడుగురు జనసేన కార్యకర్తలకు గాయాలు అయినట్లు చెపుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వారిని అక్కడి స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పవన్ కు ఏమి కాలేదు, అయన అభిమానులు ఎవరూ భయపడవలసిన పని లేదని జనసేన పార్టీ నాయకులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక ఈ ప్రమాద ఘటనపై పలు రకాల అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.
కొందరేమో ఇది అనుకోకుండా జరిగింది, పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని అంటుంటే మరికొందరు మాత్రం ఇది ఖచ్చితంగా కుట్రతోనే పన్నిన పన్నాగంగా అనుమానిస్తున్నారు. ఇక నిజానికి కొద్దిరోజుల క్రితం వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి పై దాడి ఘటన విషయమై ఇప్పటికీ పూర్తి నిజానిజాలు బయటకు రాకపోవడంతో అది ఖచితంగా టిడిపి నాయకుల  కుట్రే అంటూ కొందరు వైసిపి నాయకులూ బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఇక పవన్ కూడా చాలా రోజులనుండి టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తమ తప్పులపై వేలెత్తి చూపుతున్న పవన్ ను ఎలాగైనా అడ్డుతొలగించాలని, అదీకాక పవన్ చేపట్టిన యాత్రకు ప్రజలు కూడా విపరీతంగా బ్రహ్మరథంపట్టడంతో అది చూడలేని టిడిపి నాయకులు కొందరు అసూయతోనే ఆయనపై ఈ విధంగా దాడి చేయించారు అంటున్నారు.
నిజానికి ప్రమాదం జరిగినదానిని బట్టి చూస్తే, ఖచ్చితంగా పవన్ ప్రయాణిస్తున్న వాహనానికి వెనుక వున్న వాహనాన్నే లారీ ఢీకొట్టిందంటే, కుట్ర చేసిన వారు పవన్ వాహనాన్ని టార్గేట్ చేసి ఉంటారని, అది కొంత మిస్ అయి, అయన వెనుక వస్తున్న వాహనానికి ఆ ప్రమాదం జరిగిందని పవన్ అభిమానులు చెపుతున్న వాదన. ఏది ఏమైనప్పటికీ త్వరలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడికి ఏమి జరుగుతుందో, ఎవరెవరు తమ గెలుపు కోసం ఎటువంటి కుట్రలు పన్నుతున్నారో అర్ధంకాక ప్రజలు విపరీతమైన ఆందోళనలో మాత్రం ఉన్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here