పవన్ కాన్వాయ్ ప్రమాద ఘటనపై జగన్ షాకింగ్ కామెంట్స్!

0
243
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన పార్టీని ప్రజల్లోకి ఎప్పటికపుడు చేరువచేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం ఏపీలో విపరీతంగా యాత్రలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల అయన ప్రారంభించిన ప్రజా పోరాట యాత్రలు, అనంతపురం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సాగాయి. ఇక ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో సాగుతున్న పవన్ యాత్రకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇకపోతే నిన్న అయన తన యాత్ర పూర్తి చేసుకుని రాజమండ్రి నుండి కాకినాడ బయల్దేరిన సమయంలో మార్గమధ్యంలో రాజంపేట వద్ద, అటుగా వెళ్తున్న ఒక లారీ పవన్ కాన్వాయ్ ని ఢీ కొట్టింది. అయితే ఈ ఘటనలో పవన్ ప్రయాణిస్తున్న వాహనానికి వెనుకగా వస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన వెంటనే వాహనంలో గాయాలపాలైన ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది, మరియు ఒక ఏడుగురు జనసేన కార్యకర్తలను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఇక ప్రస్తుతం వారి పరిస్థితి పర్వాలేదని ని అంటున్నారు. అయితే ఆ సమయంలో పవన్ కు ఏమి కాలేదని, కావున అయన అభిమానులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జనసేన నాయకులు చెప్పారు.
ఇక ఈ ఘటనపై పలువురు ప్రముఖులు కూడా తమ స్పందన తెలియచేస్తున్నారు. ఇక నేడు దీనిపై వైసిపి అధినేత జగన్ కూడా స్పందించినట్లు సమాచారం. మొన్న విశాఖ ఎయిర్ పోర్ట్ లో నాపై దాడి జరిగిన విషం మీకు అందరికి తెలుసు, నిజానికి ఆ దాడిని కనీసం ఖండించని చంద్రబాబు నాయుడుగారు, దాడి మాపై మేమే కావాలని చేయుంచుకున్నామని, అదంతా మాకు సానుభూతి కోసం చేయించుకుంది అంటూ మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ఇక నేడు యాత్ర పూర్తి చేసుకుని వస్తున్న పవన్ గారి కాన్వాయ్ మీద అమానుషంగా లారీతో దాడి చేయించి ఆయన్ని కూడా అణగదొక్కాలని చూస్తున్నారని జగన్ అన్నట్లు సమాచారం. నిజానికి ప్రజలు పిచ్చివాళ్ళు కాదని, ఎవరు తమపై ఇటువంటి దాడులకు ఉసిగొల్పుతున్నారో వారికి పూర్తిగా తెలుసునని, కావున అటువంటి వారికి రాబోయే ఎన్నికల్లో గట్టిగా ఓటుతో బుద్ధి చెప్పడం ఖాయమని టిడిపిని, చంద్రబాబును ఉద్దేశించి అయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇక నాకు సోదరుడు వంటి పవన్ గారికి ఆ దేవుడు ఆశీస్సులతో ఏమి కాకపోవడం ఆనందకరమైన విషయమని, ఇటువంటి దాడులకు సీఎం గారు సమాధానం ఇవ్వాలని అన్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here