పెళ్లి చూపులు లోని అమ్మాయి ఆత్మహత్య యత్నం …. షాక్ లో ప్రదీప్ మరియు షో నిర్వాహకులు!

0
323
ఇటీవల టెలివిజన్ ఛానల్స్ వారు కూడా ఎప్పుడూ కేవలం నాటికలు, సీరియల్స్, సినిమాలు మాత్రమే కాకుండా రకరకాల కాన్సెప్ట్ లతో ప్రోగ్రామ్స్ రూపొందించి ప్రేక్షకుల అభిమానం పొందుతున్నారు. ఇక తెలుగులో ప్రధాన ఛానల్స్ అయిన ఈటివి, జెమినీ టివి, జీ తెలుగు వంటివి వేటికవె రకరకాల కొత్త కార్యక్రమాలతో దూసుకుపోతున్నాయి. అందులో భాగంగా స్టార్ మా ఛానల్ ఇటీవల యాంకర్ ప్రదీప్ పై పెళ్లిచూపులు అనే షో ని ప్రసారం చేసిన విషయం తెలిసిందే. యాంకర్ సుమ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేయబడిన కొందరు అమ్మాయిలకు కొన్ని పరీక్షలు పెట్టి అందులో విజయం సాధించినవారిని ఆ షోలోకి తీసుకుంటారు. అయితే ప్రారంభం నుండి మంచి క్రేజ్ సాధించిన ఈ షో విపరీతమైన రేటింగ్స్ తో దూసుకుపోతోంది. అయితే ఈ షో అంతా ఫేక్ అని, ప్రదీప్ పెళ్లిచూపులు నిజంకాదు అంటూ కొన్ని రకాల రూమర్స్ కూడా వస్తున్నాయి.
షోలో నియామాల ప్రకారం, ప్రతివారం ఎంపికచేయబడిన అమ్మాయిలకు సుమ కొన్ని టాస్కులు ఇస్తుంది, ఇందులో విజయం సాధించిన వారు ముందుకు వెళతారు, ఓడిపోయిన వారు ఎలిమినేట్ చేయబడి, ఇంటికి పంపివేయబడతారు. అయితే కొందరు మీడియా వర్గాలనుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ షో నుండి  ఇటీవల ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసిన ఒక  అమ్మాయి, తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిందని సమాచారం. నిజానికి ఆ అమ్మాయి షోకి వెళ్ళినపుడు ప్రదీప్ పద్ధతి తనకు ఎంతో నచ్చిందని, ఎలాగైనా షోలో గెలిచి అతడిని పెళ్లిచేసుకోవాలి అనుకుందని, అయితే అనుకోకుండా షోలో ఓడిపోయి వెనక్కిరావడం భరించలేక ఆవేదనతో తన ఇంట్లోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోబోయిందని,
అయితే విషయం తెలుసుకున్న ఇంట్లోని వారు ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా, ఆమెకు చాలా సేపు చికిత్స అందించిన డాక్టర్లు చివరకు ఆమెకు ప్రాణాపాయం తప్పిందని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారట. అయినా ఇటువంటి షోలు ప్రసారం చేసి, సాధారణ ప్రజల్లో లేనిపోని ఆశలు రేకెత్తించి చివరికి ఆ ఆశలను అడియాశలు చేస్తున్న సదరు మీడియా ఛానల్స్ వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కొన్ని మహిళా సంఘాలు గట్టిగా వాదిస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మరి సంచలనం సృష్టిస్తున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here