పేరుకు విశ్వవిఖ్యాత నటుడు, రాజకీయాల్లో తిరుగులేని కింగ్…..ఆయన లోగుట్టు వింటే మాత్రం అసహ్యం వేయకమానదు!

0
132
తెలుగులో అన్నగా పిలవబడే లెజెండరీ నటుడు ఎన్టీఆర్ గారి గురించి ఎంతచెప్పినా తక్కువే అని చెప్పాలి. ఒకరకంగా ఎన్టీఆర్ గారంటే తెలుగు ప్రజల్లో వున్న ప్రేమ, గౌరవం ఇప్పటికీ కూడా తగ్గలేదంటే అయన గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక 1983 లో కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలను విభేదించి, తెలుగువారికి ఒక పార్టీ కావాలని, మన ఆత్మగౌరవాన్ని మనమే కాపాడుకోవాలనే ఉద్దశ్యంతో అయన టిడిపి పార్టీని నెలకొల్పి, ఆ తరువాత ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించారు. ఇక తమిళ నాడులో కూడా ఎన్టీఆర్ మాదిరి ఎంజీఆర్ అంతటి ఫేమస్ నటులు. ఇక్కడ ఎన్టీఆర్ సినిమాలు అక్కడ ఎంజీఆర్ రీమేక్ చేసేవారంటే వారిద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా ఎంత ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇక ఎంజీఆర్ ను తమిళ ప్రజలు ఒక దేవుడిలా చూస్తారు, అయన సినిమాల అనంతరం డీఎంకే పార్టీలో చేరారు, అయితే ఆ పార్టీని విభేదించి, బయటకు వచ్చి, అన్నాడీఎంకే పార్టీని స్థాపించి, అప్పటి ఎన్నికల్లో వూహించనివిధంగా అద్భుత విజయం సాచించారు. ఇక ఆ తరువాత దాదాపు పదేళ్లు ఆయన అధికారంలో కొనసాగి తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని చక్రం తిప్పారు.
ఇక అయన ముఖ్యమంత్రిగా వున్నపుడే మరణించారు. అయితే ఆయనకు సంబందించిన ఒక వార్త ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి ఎంజీఆర్ అవతలివారికి సాయపడడంలో అందరికంటే ముందుండేవారని, ఇక తమిళనాడు ప్రజలు తనను ఎన్నో ఏళ్ళ పాటు హీరోగా ఆదరించి తనకు సముచిత స్థానం కల్పించినందుకుగాను తాను అన్నాడీఎంకే పార్టీ ద్వారా వాళ్ళ ఋణం తీర్చుకునే అవకాశం దొరికిందని చెప్తుండేవారు. అయితే ఆయనలో ఒకపెద్ద లోపం మాత్రం వుంది. అదేమిటంటే, అయన ఒక స్త్రీ లోలుడు, తనకు కనిపించిన స్త్రీలలో ఎవరైనా తనకు బాగా నచ్చితే, ఆమెను అనుభవించేవరకు వదిలేవారు కాదట. అంతేకాదు, ఆయనకు ఒకరుకాదు ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు భార్యలు ఉండేవారని, అందరిని అయన బలవంతంగా ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారనే పుకార్లు కూడా వున్నాయట. ఇక అయన తనతో పాటు పనిచేసే కొందరు హీరోయిన్లను కూడా కొంత లైంగికంగా ఇబ్బంది పెట్టేవారని, అందుకే అప్పట్లో అయన సినిమాల్లో నటించేటప్పుడు అందమైన అమ్మాయిలు అయన కంట పడ్డానికి భయపడేవారట.
ఇక ముగ్గురు భార్యలను అయన తన రామయంతోట ఫామ్ హౌస్ లో ఉంచి, వారిని కేవలం తన శృంగార సుఖం కోసం ఉపయోగపడే వారుగా మాత్రమే చూసేవారని, వారికీ ఏవైనా సమస్యలు వస్తే, కనీసం వారివంక కూడా చూసేవారు కాదని అంటుంటారు. ఆ విధంగానే అయన భార్యలు ముగ్గురు అస్వస్థతతో మరణించారని వినికిడి. ఇక ఆ తరువాత ఆయన కళ్ళు అప్పుడే సినిమాల్లోకి వస్తున్న జయలలితపై పడ్డాయని, ఆమెను ఎన్నో సార్లు తనవద్దకు బెదిరించి రప్పించి మరీ అయన బలవంతంగా అనుభవించేవారని, అయితే అయనకు భయపడ్డ జయలలిత, తప్పక ఆయనకు లొంగేదని టాక్. ఇక ఆమె కొన్నాళ్ళు శోభన్ బాబుతో ప్రేమలో పడడం తెలుసుకుని ఎంజీఆర్ ఆమెను గట్టిగా మందలించారని కూడా అంటుండేవారట. ఇక ఆమెను మెల్లగా తన పార్టీలోకి తీసుకున్న ఎంజీఆర్, ఎప్పుడూ జయలలిత ను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టేవారని, అందుకే ఆమె తన జీవితంలో పెళ్లిపై కూడా విరక్తి పెంచుకుని ఎవ్వరిని పెళ్లి చేసుకోలేదని అంటున్నారు. కాగా ప్రస్తుతం ఎంజీఆర్ గురించి తమిళనాట చక్కర్లు కొడుతున్న ఈ వార్త, వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తోంది.