ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దుండగుడు దాడి…..మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు!

0
264
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. మొదటినుండి మొక్కవోని దీక్షతో యాత్ర చేపడుతున్న జగన్ కు వెళ్లిన ప్రతీ చోటా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక అయన పర్యటనలో భాగంగా ప్రజలు ఆయనకు పలు సమస్యలపై మొరపెట్టుకుంటుంటే, తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం వలె తాము అధికారమే పరమావధిగా రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు మేలు చేకూర్చడమే తమ ద్యేయమని అయన అంటున్నారు.
ఇకపోతే అయన మాట్లాడుతూ నేటి రాజకీయాలు కుట్ర మరియు కుతంత్రాలతో కూడినవాని, అయితే తన తండ్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు తనకు న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీతో కూడిన రాజకీయాలను మాత్రమే నేర్పారని, తమ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన వెంటనే ముందు ప్రజల ప్రధాన సమస్యలపైనే తన దృష్టి ఉంటుందని అయన స్పష్టం చేసారు. ఇక ప్రజాసంకల్ప యాత్ర చేపడుతున్న ఆయన, ప్రతి శుక్రవారం ఆయన తనపై ఉన్న కేసులో భాగంగా హైదరాబాద్ లోని కోర్ట్ కు హాజరయి, అక్కడ సంతకం పెట్టి వస్తుంటారు. ఇక నేడు తన ప్రజా యాత్ర ముగించుకుని కాసేపటి క్రితం హైదరాబాద్ వెళ్లే ఫ్లైట్ కోసం విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో నిరీక్షస్తున్నారు.
ఇక ఎయిర్ పోర్ట్ లోని లాంజ్ కు చేరుకున్న జగన్ అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటుండగా, అనూహ్యంగా అక్కడి వెయిటర్ ఒకతను, జగన్ వద్దకు దూసుకొచ్చి ఆయనపై కత్తితో దాడి చేసాడు. ఆ సమయంలో జగన్ భుజానికి చిన్న గాయమైంది. ఆ వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. తక్షణమే జగన్ ని అక్కడి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అయితే అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు జగన్ పై దాడి చేసాడు అనే విషయాలు మాత్రం తెలియవలసి ఉందని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని పోలీసులు చెపుతున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here