ప్రదీప్ పెళ్ళిచూపుల్లో టెన్షన్ పెడుతున్న అనసూయ!

0
190

ప్రస్తుతం స్టార్ మా చానల్ లో ప్రసారం అవుతున్న ప్రదీప్ పెళ్లిచూపులు కార్యక్రమంపై కొంత మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ, ఈ షో చాలా డిఫరెంట్ గా ఉందంటూ, కొందరు మాత్రం షోపై ప్రశంశలు కురిపిస్తున్నారు. ఇక ఈ షోకు నేడు క్రేజీ యాంకర్ అనసూయ, సుధీర్ కి ఫ్రెండ్ గా రానుంది. ఇక ఆమెకు సంబందించిన ఒక ప్రోమోని కాసేపటి క్రితం స్టార్ మా విడుదల చేసింది. ఈ ప్రోమోలో అనసూయని రిసీవ్ చేసుకోవడానికి ఆమె కారు దగ్గరకు వచ్చి, ఆమెకు సాదర ఆహ్వానం పలుకుతాడు ప్రదీప్. అయితే ఈ పెళ్లిచూపులు తేల్చడానికి తాను ఇక్కడికి వచ్చినట్లు చెప్పి అందరికి మొదట్లోనే ఝలక్ ఇస్తుంది అనసూయ. ఇకపోతే ఒక అమ్మాయితో నువ్వు ప్రదీప్ తో డేట్ వెళ్లే ఛాన్స్ వస్తే ఏ సమయంలో రిజెక్ట్ చేస్తావ్ అని, ఇక మరొక అమ్మాయిని అయితే, నువ్వు ఈ షోలో ప్రదీప్ తో వచ్చిన డేట్ ఛాన్స్ ని ఎవరికి ఇస్తావ్ అని అడగ్గా, అందుకు ఆ అమ్మాయి సమాధానమిస్తూ, తనకు నిజానికి ఇక్కడికి వచ్చేముందు ఏమి తెలియదని, ఇప్పడు అంత తెలిసాక, ఇక్కడివారు నాకు ఏమవుతారని వీరిలో ఒకరికి నా డేట్ ఛాన్స్ ఇవ్వాలి అంటూ షాకింగ్ గా సమాధానమిస్తుంది.

ఇకపోతే మరొక అమ్మాయితో నీకు ప్రదీప్ కావాలా, ఫ్యామిలీ కావాలా అంటూ ప్రశ్న అడగ్గా, అందుకు ఆ అమ్మాయి ఒక్కసారిగా షాక్ కు గురైన షాట్ ప్రోమోలో ఆకట్టుకుంది. ఇకపోతే చివరిగా మరొక అమ్మాయితో ఇప్పటివరకు నువ్వు నీ ఫ్యామిలీ విషయం వచ్చినప్పుడల్లా తప్పించుకున్నావ్, ఇప్పుడు అలా కుదరదు, నువ్వు ఇప్పుడు తప్పనిసరిగా నీ ఫ్యామిలీకి సంబందించిన విషయాలన్నీ షేర్ చేసుకోవాలి అనగానే, ఆ అమ్మాయి కంట నీరు ఆగదు. ఇక మొత్తంగా ఈ ప్రోమో నేటి షోపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది అని చెప్పవచ్చు. మరి అనసూయ ప్రోమోలో చూపినట్లు ఖచ్చితంగా వ్యవహరిస్తూ ప్రశ్నలు వేస్తుందో, లేక అందరూ అమ్మాయిలతో కాస్త కలుపుగోలుగా మాట్లాడుతూ నడుచుకుంటుందో తెలియాలంటే మాత్రం నేటి షో జరిగేవరకు వెయిట్ చేయవలసిందే మరి……