ప్రదీప్ బర్త్ డే కి షాకింగ్ గిఫ్ట్ ఇచ్చిన సుడిగాలి సుధీర్!

0
335
ప్రస్తుతమున్న బుల్లితెర యాంకర్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ ఎవరేంటే, అందరికి మొదటగా గుర్తొచ్చే పేరు ప్రదీప్ మాచిరాజు. ఆడియన్స్ లో మంచి పేరు సంపాదించినా ప్రదీప్ కొన్నాళ్ల నుండి టెలివిజన్ షోలు, ఆడియో ఫంకన్లతో పటు అక్కడక్కడ కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. మొదటి నుండి ప్రదీప్ తన ఆకట్టుకునే యాంకరింగ్ తో కొందరు అభిమానులను కూడా సంపాదించుకున్నాడనే చెప్పాలి. ప్రస్తుతం తనకు పోటీగా యాంకర్ రవి వంటివారు ఉన్నప్పటికీ ప్రదీప్ వారిని దాటుకుంటూ రోజురోజుకు ముందుకు దూసుకెళ్తున్నాడు అనే చెప్పుకోవాలి. నిజానికి తెలుగు టెలివిజన్ షోలలో మంచి క్రేజ్ మరియు రేటింగ్స్ సంపాదించిన కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను, ఢీ10 వంటి షోలు ప్రదీప్ ఖాతాలో వున్నాయి. ఇక అతను, యాంకర్ సుమతో కలిసి చేస్తున్న ఒక వెరైటీ కాన్సెప్ట్  షో ప్రదీప్ పెళ్లి చూపులు కూడా మంచి ప్రేక్షకాధరణతో దూసుకుపోతోంది. ఇక నేడు తన 32వ పుట్టినరోజు జరుపుకోనున్న ప్రదీప్ కు పలువురు అభిమానులు మరియు బుల్లితెర నటులు శుభాకాంక్షలు చెపుతున్నారు. 
అయితే వారిలో జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్, ప్రదీప్ కు ఒక ఊహించని బహుమతిని ఈ పుట్టినరోజు సందర్భంగా ఇచ్చినట్లు సమాచారం. సుధీర్ మాట్లాడుతూ, తనకు ఇష్టమైన యాంకర్లలో ప్రదీప్ ఒకరని, ప్రదీప్ ఎప్పుడూ సెట్లో నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉంటాడని, కావున ప్రదీప్ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పాడట. అంతేకాదు, ప్రదీప్ తాను వేసుకునే సూట్స్ లో చాలాస్టైలిష్ గా ఉంటాడు కాబట్టి అతనికి ఒక కాస్ట్లీ సూట్ ని కానుకగా పంపించాడట. ఇక సుధీర్ పంపిన ఆ బహుమతిని చూసిన ప్రదీప్ ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేస్తూ, థ్యాంక్ యు బ్రదర్ సుధీర్, మీరు పంపిన బహుమతి నిజంగా నా గుండెను హత్తుకుంది. మెనీ థ్యాంక్స్ టూ యు సుధీర్ అంటూ ప్రదీప్ తెలిపాడట. కాగా సుధీర్ ఇలా ప్రదీప్ బర్త్ డే కు గిఫ్ట్ ఇవ్వడంతో పలువురు నెటిజన్లు సుధీర్ ను యు ఆర్ రియల్లీ గ్రేట్ సుధీర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here