ప్రపంచంలోనే అతి తక్కువ ధరగల స్మార్ట్ టివి ఇండియాలో విడుదల… ఫీచర్స్ చూస్తే మతి పోతుంది!

0
203
ఇప్పటికే భారత ఎలక్ట్రానిక్స్ మార్కెట్ రోజు రోజుకు మరింతగా వృద్ధి చెందుతోంది. ఓవైపు మొబైల్స్ మరోవైపు గృహోపకరణాల విభాగాల్లో రకరకాల మోడల్స్ దర్శనమిస్తున్నాయి. అయితే నేడు భారత్‌లో అతి తక్కువ చౌక ధర కలిగిన స్మార్ట్ టీవీని ఢిల్లీకి చెందిన సామీ ఇన్ఫర్మాటిక్స్ అనే కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఈ టీవీ ధర కేవలం రూ.4,999 మాత్రమే. ప్రపంచంలోనే అత్యల్ప ధరతో లభిస్తున్న ఏకైక స్మార్ట్ టివి ఇదే కావడం విశేషం. ఇక సాధారణంగా 32 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ అంటే తొమ్మిది వేల నుంచి రూ.12వేల మధ్య వుంటుంది. కాస్త చిన్న సైజ్ టీవీ అయితే రూ.15వేల వరకు వుంటుంది. కానీ ఇది వాటిలో సగం కన్నా కూడా తక్కువ ధరకు లభించడం నిజంగా ఆశ్చర్యకరం.
Image result for 4999 tv
ఇక నేడు ఢిల్లీలో కంపెనీ విడుదల చేసిన ఈ టీవీలో 1366×786 హెచ్డీ రిజల్యూషన్, 10 వాట్ స్పీకర్స్, 512 జీబీ స్టోరేజ్, ఎస్ఆర్‌ఎస్‌ డాల్బీ డిజిటల్‌, 5 బ్యాండ్‌ ఇన్‌ బిల్ట్‌ వైఫై కనెక్టివీటీ, స్క్రీన్‌ మిర్రరింగ్‌ సౌకర్యాలుంటాయని, ఫేస్‌ బుక్‌, యూట్యూబ్‌ వంటి యాప్స్‌ వినియోగించుకోవచ్చు. ఇక ఈ టీవీని పేదల కోసమే రూపొందించినట్లు సామీ ఇన్ఫర్మాటిక్స్ కంపెనీ అధికారులు తెలిపారు. ఈ టీవీ ఆండ్రాయిజ్ 4.4 కిటిక్యాట్‌తో పనిచేస్తుంది. 2హెచ్డీఎమ్ఐ 2 యూఎస్‌‌బీ పోర్ట్స్‌ను కలిగివుంటుంది. రెండు 10డబ్ల్యూ స్పీకర్‌ను ఇది కలిగివుంటుంది. అయితే ఈ టీవీని ఆర్డర్ చేయాలన్నా లేదా కొనుగోలు చేయాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. ఇక ప్రస్తుతం ఈటివి కోసం లక్షలాదిగా తమకు బుకింగ్స్ లభిస్తున్నాయని, రాబోయే రోజుల్లో ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు చెపుతున్నారు. …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here