ప్రభాస్ ఇంట్లో ఎలావుంటాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0
335
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఒక జాతీయ స్థాయి నటుడు. బాహుబలి రెండు భాగాలూ అద్భుత విజయాన్ని అందుకోవడంతో ప్రభాస్ ఇమేజ్ ఒక్కసారిగా చాలా దేశాల్లో మారుమ్రోగిపోయిందనే చెప్పుకోవాలి. ఇకపై ఆయన చేయబోయే సినిమాలు కేవలం తెలుగులోనే కాక దేశంలోని ప్రధాన భాషల్లో కూడా విడుదల కానున్నాయి. ఇక ప్రస్తుతం అయన హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న సాహూ సినిమా దాదాపుగా రూ.200 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారంటే అయన మార్కెట్ స్థాయి ఏ మేరకు పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు ఆయనకు దేశ విదేశాల్లోనూ ఫ్యాన్స్ కూడా విపరీతంగా పెరిగారు. ఇక ప్రభాస్ గురించిన విషయం ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతోంది. 
అదేంటంటే ప్రభాస్ ఇంట్లో వుండే పద్దతిని విన్న కొందరు అయన ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి తన పెద్దనాన్న కృష్ణంరాజు గారి లాగా పైకి ఎంత గాంభీర్యంగా కనపడ్డా లోపల మాత్రం ఎంతో సౌమ్యమైన మనస్తత్వం కల వ్యక్తి అని, అంతేకాదు ఒకరకంగా ఆయనది మంచి మనసున్న చిన్నపిల్లవాడి మనస్తత్వం అని అయన దగ్గరి వారు అంటున్నారు. తనవాళ్లతో ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ వుండే ప్రభాస్, ఇటీవల తన తండ్రి మరణంతో కొంత క్రుంగిపోయారని తెలుస్తోంది. అయితే ఆ తరువాత కృషంరాజు గారు తనకి తండ్రి లేని లోటు తీర్చారని, ఇక అప్పటినుండి ప్రభాస్ మరింత జోష్ తో ముందుకు సాగుతున్నారట. ఇక ప్రభాస్ తన అక్క చెల్లెళ్లు మరియు అన్నదమ్ములతో ఎంతో క్లోజ్ గా ఉంటారట, అలానే ఇంట్లోని పనివారి దగ్గరినుండి తన ఫ్రెండ్స్ వరకు ఎవరి ఇంట్లో ఎటువంటి శుభకార్యం వున్నా, ఏ మాత్రం భేషిజం లేకుండా వెళ్లి, వారికి తనవంతు సాయాన్ని అందిస్తుంటారట.
అంతేకాదు, ప్రభాస్ తన ఇంట్లో పనిచేసేవారికి కూడా ఎంతో ప్రాధాన్యం ఇస్తారని, వారిని కూడా తమ సొంత మనుషులవలె చూసుకుంటారని చెపుతున్నారు. ఇకపోతే ప్రభాస్ ఎక్కడున్నా ఆ ప్రాంతం మొత్తం మంచి సందడిగా ఉంటుందని, అందుకే అయన తన మనసుకు దగ్గరైన ప్రతిఒక్కరినీ డార్లింగ్ అని పిలుస్తూ ఎంతో హ్యాపీగా మాట్లాడతారని తెలుస్తోంది. అయితే ప్రభాస్ ఎక్కువగా పార్టీ కల్చర్ ఇష్టపడరని, కానీ ఫ్రెండ్స్ తో మరియు ఫ్యామిలీ మెంబర్స్ తో సరదాగా టూర్స్ కి మాత్రం వెళ్తుంటారని చెపుతున్నారు. మరి విన్నారుగా ఫ్రెండ్స్ సినిమాల్లో ఎంతో గంభీరంగా కనపడే మన బాహుబలి, బయట ఎంత సౌమ్యంగా వుంటారో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here