Home సినిమా ప్రముఖ కమెడియన్ భార్య మృతి…షాక్ లో టాలీవుడ్ పరిశ్రమ!

ప్రముఖ కమెడియన్ భార్య మృతి…షాక్ లో టాలీవుడ్ పరిశ్రమ!

0
289

తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఎందరో అభిమానులను సంపాదించుకున్న కామెడియన్లలో కొందరు మాత్రం ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన వారు వున్నారు. అటువంటి వారిలో చెప్పుకోదలచిన వ్యక్తి రమణారెడ్డి. నెల్లూరు జిల్లాకు చెందిన తిక్కవరపు వెంకట రమణారెడ్డి, చిన్నప్పటినుండి నాటకాలు వేస్తూ, తరువాత సినిమాల్లోకి ప్రవేశించారు. అయన మొదటి సినిమా మానవతిలో అయన పాత్ర చిన్నదే అయినా మంచి పేరు సంపాదించారు రమణారెడ్డి. అప్పట్లో రేలంగి, పద్మనాభం, రాజబాబు వంటి వారితో పాటు మంచి పేరు సంపాదించిన రమణారెడ్డి మొదటినుండి మంచి హాస్య చతురత గల వ్యక్తి. అయన సెట్లో ఉన్నంతసేపు అందరిని ఎంతో హాయిగా నవ్విస్తూ, సరదాగా ఉండేవారని అంటారు ఆయనతో కలిసి నటించిన వారు చెపుతుంటారు. ఎన్నో సినిమాల్లో తన అద్భుత హాస్యంతో అందరిని ఆకట్టుకున్న రమణారెడ్డి గారు 1974లో తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయారు. రమణారెడ్డి గారి భార్య పేరు సుదర్శనమ్మ, ఆయనకు ముగ్గురు సంతానం. రమణారెడ్డి మరణం తరువాత అయన కుటుంబ సభ్యులు ఎవరూ సినీ పరిశ్రమలో లేకపోవడంతో ఆయన కుటుంబం గురించి ఎవరికి పెద్దగా విషయాలు తెలియలేదు.

నిజానికి రమణారెడ్డి గారి కుమారులు మరియు కుమార్తె అప్పట్లోనే అమెరికా వెళ్లి, అక్కడ ఉన్నత విద్యను అభ్యసించి, ఆ తరువాత పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డట్లు సమాచారం. కాగా ప్రస్తుతం 93ఏళ్ళ రమణారెడ్డి గారి భార్య సుదర్శనమ్మ నిన్న తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల నుండి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఆవిడ చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం ఒక్కసారిగా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమె మరణాన్ని ఆపలేకపోయారు. కాగా నేడు ఆమె పార్థివ దేహాన్ని చెన్నైలోని రమణారెడ్డి గారి స్వగృహంలో ఉంచనున్నారు. అయితే వారి ఇద్దరి కుమారులు నేటి రాత్రి చెన్నై చేరుకుంటారని, అనంతరం రేపు ఉదయం చెన్నైలో ఆమె అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here