ప్రముఖ గాయకుడి ఇంట్లో తీవ్ర విషాదం…శోకసంద్రంలో చిత్ర పరిశ్రమ!

0
204

 

బాలీవుడ్ లో పేరుగాంచిన ప్రముఖ గాయకుల్లో దలేర్ మెహందీ ఒకరు. నిజానికి పంజాబ్ కు చెందిన అయన గురించి అక్కడివారికె  కాదు ఇటు తెలుగు అటు తమిళ ప్రజలకు కూడా చాలా వరకు తెలుసు. ఆయన తెలుగులో  యమదొంగ సినిమాలోని రబ్బరు గాజులు సాంగ్, అలానే పైసా వసూల్ టైటిల్ సాంగ్, ఇక బాహుబలిలో భళి భళి రా భళి, ఇక ఇటీవలి అరవింద సమేతలో రెడ్డి ఇక్కడ సూడు వంటి పాపులర్ సాంగ్స్ తో అదరగొట్టారు. అయితే నేడు అయన ఇంట ఒక విషాద సంఘటన జరిగింది. అయన పెద్దన్నయ్య అమర్ జీత్ సింగ్ నిన్న ఢిల్లీలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో మృతి పొందారు. నిజానికి గత కొద్దిరోజులుగా శ్వాసకోశ  వ్యాధితో చికిత్స పొందుతున్న అమర్ జీత్, రెండు మూడు రోజలుగా అనారోగ్యంతో ఎంతగానో పోరాడి చివరికి నిన్న రాత్రి ఆసుపత్రిలోనే కన్నుమూశారట. కాగా, దలేర్ మెహేంది రెండవ అన్నయ్య మికా సింగ్ ఈ విషయాన్ని నేడు సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఆవేదనతో పోస్ట్ చేస్తూ చెప్పారు

మా ప్రాణ సమానులైన మా అన్నయ్య అమర్ జీత్ సింగ్ గతకొద్దిరోజులు గా చికిత్స తీసుకుంటూ నేడు అనంతలోకాలకు వెళ్లిపోయారు. అయన నిజానికి మాకు అన్నయ్య అనడం కంటే, తండ్రి వంటి వారు అని చెప్తుంటాం అని ఆయన్ని గుర్తుచేసుకున్నారు. ఇక ఆయన మరణంతో అటు దలేర్, మరియు ఇతర కుటుంబ సభ్యులు హర్ జీత్ మెహేంది, మరియు జోగెదర్ సింగ్ లకు కూడా ఎంతో బాధను కలిగించే విషయమని అన్నారు. ఆయన ఆత్మకు ఆ భగవంతుడు శాంతిని చేకూర్చాలని కోరుకుంటున్నట్లు ఆ పోస్టులో తెలిపారు. ఇక ఈ విషాద వార్తను విన్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు దలేర్ ఇంటికి చేరుకొని అమర్ జీత్ కు నివాళులు అర్పిస్తున్నట్లు సమాచారం. అయితే దలేర్ నిన్న ఒక షూటింగ్ లో ఉండగా ఈ విషయం తెలిసిందని, ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిన హాస్పిటల్ కు చేరుకొని అన్నయ్య పార్థివదేహం వద్ద కన్నీరు మున్నీరయినట్లు వారి బంధువులు చెపుతున్నారు…..