ప్రముఖ నటి ఈశ్వరిరావు భర్త ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

0
365
90వ దశకంలో మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ టాలీవుడ్ తెరపై మెరిసిన నటి ఈశ్వరి రావు. ఈశ్వరి ని చూసిన ప్రతిఒక్కరు ఈమె మన అచ్చం మన తెలుగు అమ్మాయిలా ఉందే అని అనుకుంటుంటారు. నిజానికి ఆమె నేపథ్యం మరియు పర్సనల్ లైఫ్ గురించి చాలామందికి తెలియదు. ఇక చెప్పాలంటే ఈశ్వరి రావు మన అచ్చ తెలుగు అమ్మాయి. ఆమె తల్లితండ్రులు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉండేవారు. ఈశ్వరిరావు చలావరకు తన బాల్యాన్ని రాజమండ్రిలోనే గడిపారు. అయితే కొన్నాళ్ల తరువాత ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా చెన్నై కి ట్రాన్ఫర్ కావడంతో, వారి ఫ్యామిలీ చెన్నై కి వెళ్ళిపోయి అక్కడే స్థిరపడింది. నిజానికి ఈశ్వరి రావు మొదటి సినిమా తెలుగుదే, అదే ఇంటింటా దీపావళి.
ఆ సినిమాలో ఆమె చిన్నపాత్రలో కనపడతారు. ఇక ఆ తరువాత జగన్నాటకం, కలికాలం చిత్రాల్లో నటించారు. వాటిలో తన నటనతో ఆకట్టుకున్న ఈశ్వరి రావు, దర్శక దిగ్గజం బాపుగారి కళ్ళలో పడ్డారు. ఆమెను చూసిన వెంటనే, తాను రాజేంద్ర ప్రసాద్ తో తీయబోయే రాంబంటు సినిమాలో ఈశ్వరి రావుకి ఏకంగా హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు బాపు. ఆ సినిమా పెద్దగా అడనప్పటికీ, ఈశ్వరి గారికి మంచి నటిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక అప్పటినుండి ఆమె తమిళంలో కూడా బాగా బిజీ అవుతూ వచ్చారు. అయితే తెలుగులో మాత్రం సరైన పాత్రలు రాని కారణంగా ఆమె తెలుగు సినిమాలు చాలా కాలంపాటు చేయలేదు. ఆతరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన భద్ర సినిమాతో ఆమె టాలీవుడ్ లో ఆమె రీఎంట్రీ ఇచ్చారు.
ఇక అప్పటినుండి ఆమె అక్కడక్కడా అడపాదడపా తమిళ్ మరియు తెలుగు సినిమాలు చేస్తూ వచ్చారు. ఇటీవల ఆమె రజినీకాంత్ సరసన కాలా సినిమాలో దాదాపు హీరోయిన్ స్థాయి పాత్రలో నటించి అందరిని మెప్పించిన విషయం తెలిసిందే. ఇక ఆమె భర్త మరెవరో కాదు ప్రముఖ దర్శకులు ఎల్. రాజా. తమిళ్ లో పలు చిత్రాలను తెరకెక్కించిన రాజా, అక్కడి వారికి బాగా సుపరిచితులు. అయితే మొదటినుండి తన బిడ్డలకు, కుటుంబానికి ప్రాధాన్యత నిచ్చే ఈశ్వరి గారు, తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా మీడియా వారితో షేర్ చేసుకోకపోవడంతో ఆమె ఫ్యామిలీ గురించి ఎవరికి తెలియదు. ఇక ఈశ్వరి, రాజా దంపతులకు ఇద్దరు సంతానం. ప్రస్తుతం అటు సినిమాలు, ఇటు ఫ్యామిలీ లైఫ్ తో తన జీవితం ఆనందంగా ఉందని ఈశ్వరి ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here