ప్రముఖ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్న దేవిశ్రీ ప్రసాద్…. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

0
314
టాలీవుడ్ సినీ చరిత్రలో మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఎరా పూర్తి అయిన తరువాత, ప్రస్తుతం అంతటిపేరు సంపాదించింది ఎవరు అని అంటే, ఎక్కువగా వినపడే పేరు దేవిశ్రీ ప్రసాద్. మెగాస్టార్ చిరంజీవి నుండి నాచురల్ స్టార్ నాని వరకు  అయన అందరి సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఇకపోతే తనపాటల్లో కొంత ప్రత్యేకతను ప్రేక్షకులకు అందించే దేవిశ్రీ, మణిశర్మ తరువాత సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడంలో కూడా మంచి దిట్ట అనే చెప్పాలి. ఇక అయన తండ్రి సత్యమూర్తి ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే అయన మరణానికి ముందు దేవి, హీరోయిన్ చార్మీ ని పెళ్లి చేసుకోనుతున్నారు అంటూ అప్పట్లో కొన్ని రూమర్లు వచ్చాయి. అయితే తండ్రి మరణం తరువాత తల్లి కోరికమేరకు త్వరలో పెళ్లి చేసుకోవాలని చూస్తున్న దేవికి ఆమె తల్లి మంచి అమ్మాయిని వెతికే పనిలో నిమగ్నమయ్యారట. అంతేకాదు ఇప్పటికే పలువురు అమ్మాయిలను చూసిన అయన తల్లి, ఇకపై మరింతగా పెళ్లికూతుళ్ల వేట కొనసాగించనున్నారట.
ఇకపోతే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, దేవి శ్రీ కి నచ్చిన అమ్మాయి ఆల్రెడీ దొరికేసిందని అంటున్నారు. నిజానికి ఆ అమ్మాయి మరెవరో కాదు, త్వరలోనే రాంచరణ్ మరియు బోయపాటిల కలయికలో రానున్న వినయవిధేయ రామ సినిమాలో కైరా అద్వానీ తో పాటు నటించి, తెలుగు తెరకు పరిచయం అవుతున్న అమ్మాయని అంటున్నారు. నిజానికి ఈ సినిమాలో ఆ అమ్మాయిని దర్శకుడికి రికమండ్ చేసింది దేవీశ్రీని అట. గత కొద్దిరోజులుగా వారిద్దరి మధ్య స్నేహం కొనసాగుతుందని, మెల్లగా ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని, ఇక త్వరలో వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు చెపుతున్నారు. అయితే ఆ అమ్మాయి పేరు మరియు మిగతా విషయాలు మాత్రం తెలియరాలేదు. ఇక ఈ విషయం విన్న దేవి ఫాన్స్ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని చరణ్ మూవీ విడుదల కోసం వేచిచూస్తున్నారట. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మరి సంచలనం సృష్టిస్తున్న ఈ వార్త కనుక నిజమే అయినట్లయితే ఇక దేవిశ్రీ ఇంట పెళ్ళిసందడి నెలకొన్నట్లే మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here