ప్రియదర్శి, రాహుల్ రామ కృష్ణ ని మించిపోయే యాక్టింగ్ చేసే నటుడిని పరిచయం చేసిన విజయ్ దేవరకొండ|

0
297
పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ, ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో అక్కడినుండి మంచి అవకాశాలు దక్కించుకున్నాడు. అయితే మొదట్లో అక్కడక్కడా చిన్న చిన్న పాత్రలు చేసిన విజయ్, ఆ సినిమా విజయం తరువాత తన సినిమాలను చాలా సెలెక్టివ్ గా ఎంచుకుంటూ వస్తున్నాడు. ఇక ఆ తరువాత వచ్చిన ద్వారక పెద్దగా ఆడనప్పటికీ, ఆ వెంటనే వచ్చిన అర్జున్ రెడ్డి, సూపర్ డూపర్ హిట్ అవడంతో, విజయ్ టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఇక అక్కడినుండి అతనికి పెద్ద బ్యానర్ల నుండి సినిమా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అయితే అనంతరం చేసిన ఏం మంత్రం వేశావే ఫ్లాప్ అయినా, వెనువెంటనే వచ్చిన గీత గోవిందం మరొక సూపర్ హిట్ అవడంతో విజయ్ కి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఇక కొన్నాళ్ల క్రితం అయన చేసిన నోటా సినిమా పెద్దగా ఆడలేదు, ఇక ప్రస్తుతం అయన నటిస్తున్న కొత్త సినిమా టాక్సీ వాలా.

ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక నిన్న హైదరాబాద్ లో ఎంతో వైభవంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ గా విచ్చేసి, మూవీ యూనిట్ కి, హీరో విజయ్ కి అల్ ది బెస్ట్ చెప్పారు. అయితే ఫంక్షన్ స్టేజి పై ఎంతో ఉద్వేగభరితంగా మాట్లాడిన విజయ్, తన అభిమానుల సపోర్ట్ ని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ వారికి కృతజ్ఞతలు చెప్పాడు. స్టేజిపైకి సినిమాలోని ప్రధాన టెక్నీషియన్లను ఒక్కొక్కరిని పిలిచిన విజయ్, వారు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో వివరించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో ఒక మెయిన్ కామెడీ పాత్ర చేసిన, తన స్నేహితుడు మరియు టాలీవుడ్ కి ఈ సినిమాతో పరిచయం అవుతున్న విష్ణు అనే కుర్రాడిని పిలిచి అతని యాక్టింగ్ గురించి ఎంతో గొప్పగా చెప్పాడు.
విష్ణుతో తనకు చాలా అనుబంధం ఉందని, నిజానికి అతడొక మంచి టాలెంటెడ్ ఫోటోగ్రాఫర్ అని, అయితే తనలోని కామెడీ యాంగిల్ ని ఒక సారి చూసిన ఈ సినిమా దర్శకుడు సినిమాలో తనకి మంచి కామెడీ క్యారెక్టర్ ఇచ్చాడని చెప్పారు. అంతేకాదు పెళ్లి చూపులు సినిమాలో ప్రియదర్శి, అర్జున్ రెడ్డి లో రాహుల్ రామ కృష్ణ చేసిన యాక్టింగ్ కంటే కూడా ఇతను ఈ సినిమాలో చాలా బాగా చేసాడని, సినిమా చూసిన తరువాత పెద్ద డైరెక్టర్లు అందరూ విష్ణు ని తీసుకోవాలని ముందుకు వస్తారని తాను భావిస్తున్నట్లు తెలిపాడు విజయ్. మరి విజయ్ చెప్పినట్లు విష్ణు క్యారెక్టర్ ఈ సినిమాలో ఎలా ఉంటుందో, ఎంతమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలంటే మాత్రం ఈ నెల 17వరకు వేచిచూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here