బర్త్ డే రోజు తన పెళ్లి గురించి ప్రభాస్ ఏమన్నాడో తెలుసా!

0
400
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేడు తన 39వ పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ పుట్టిన రోజు ప్రభాస్ కు ఒకింత ప్రత్యేకం అనే చెప్పాలి. ఎందుకంటే సూపర్ డూపర్ హిట్ మూవీ బాహుబలి తరువాత ప్రభాస్ చేయబోయే సినిమా సాహూ టీజర్ విడుదల చేసారు ఆ సినిమా యూనిట్. అంతే కాదు ఎన్నో రోజులనుండి ప్రభాస్ పెళ్లి గురించి ఎదురుచూపులు చూస్తున్న అయన అభిమానులకు ప్రభాస్ నేడు ఒక ప్రకటన రూపంలో పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. అదేమిటంటే ఎప్పటినుండో ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఎదురు చూపులకు నేడు ప్రభాస్ నుండి సమాధానం వచ్చినట్లు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం వస్తోంది. అయితే తన పెళ్లి విషయమై మొట్టమొదటిసారి స్పందించిన ప్రభాస్ తన పెళ్లి విషయమై ఒకవారం రోజుల్లో ప్రకటన విడుదల చేస్తున్నట్లు చెప్పాడట.
అయితే ఈ వార్త ఇప్పటికే తెలిసిన ఆయన బంధువుల్లో ఆనందోత్సాహాలు మొదలయ్యని తెలుస్తోంది. ఇకపోతే ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరని అందరూ ఒకటే ఆలోచన చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఆమె మరెవరోకాదు అనుష్క అంటుంటే, మరికొందరు మాత్రం ఆమె గుంటూరుకు చెందిన ఒక ప్రముఖ డాక్టర్ అని చెపుతున్నారు. మరి ఎన్నాళ్ళనుండో ఊరిస్తున్న ప్రభాస్ పెళ్లి విషయం ఇప్పటికి తేలడం, అది కూడా స్వయంగా ప్రభాస్ ప్రకటన చేయబోతుండడంతో అయన అభిమానులు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇక నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆల్రెడీ రిలీజైన సాహూ మేకింగ్ టీజర్ ఓవైపు అదరగొడుతుంటే, మరోవైపు ప్రభాస్ పెళ్లి ప్రకటన రూపంలో అయన అభిమానులకు డబుల్ ట్రీట్ లభించినట్లయింది. ఏమంటారు ఫ్రెండ్స్, నిజమే కదా మరి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here