బిగ్ బాస్ ఫైనల్ కి చీఫ్ గెస్ట్ గా నో చెప్పిన ఎన్టీఆర్…..కారణం ఇదే!

0
311
స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతో ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ సంపాదించిన షో బిగ్ బాస్. ఈ షో సీజన్ 1 కి హోస్ట్ గా వ్యవహరించిన హీరో ఎన్టీఆర్, షో ను రోజురోజుకు మరింత మరింత కేజ్రీగా ముందుకు తీసుకెళ్లారు. అయితే మంచి రేటింగ్స్ సంపాదించి ఎట్టకేలకు ముగిసింది సీజన్ 1. అప్పటినుండి ప్రేక్షకులు సీజన్ 2 ఎపుడు మొదలు అవుతుందా అని ఆశగా ఎదురు చూడసాగారు. ఇక మొత్తానికి నానిని హోస్ట్ గా ప్రకటిస్తూ ఇటీవల మొదలైన సీజన్ 2, మొదట కొంత చప్పగా సాగినా, ఇక చివరి అంకానికి చేరుకోవడంతో ప్రస్తుతం రోజురోజుకు మంచి ఉత్కఠతతో సాగుతోంది. అయితే ఈ ఫైనల్ లో ఎవరు విజేతగా నిలుస్తారో రేపు జరగబోయే ఆఖరి ఎపిసోడ్ లో తేలిపోనుంది.
ఇక ఈ ఫైనల్ ఎపిసోడ్ కి చీఫ్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రానున్నట్లు సమాచారం. అయితే ఆయనను గెస్ట్ గా బిగ్ బాస్ టీమ్ ఆహ్వానించిందట. కానీ, ఆ ఆహ్వానాన్ని ఎన్టీఆర్ సున్నితంగా తిరస్కరించారట. దానికి ఒక ప్రధాన కారణం ఉందని, అది ఏమిటంటే, తాను సీజన్ 1 కు హోస్ట్ గా వ్యవహరించానని, అయితే తాను ఆశించినట్లు ఈ సీజన్ కు ప్రేక్షకుల నుండి ఊహించిన స్పందన లేదని సమాచారం ఉన్నందున, ఫైనల్ ఎపిసోడ్ కి తాను హోస్ట్ గా వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజజం ఉండకపోవచ్చని ఎన్టీఆర్ అన్నారని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఈ విషయంలో ఎంతవరకు ఉందొ తెలియాలంటే మాత్రం రేపటివరకు వేచిచూడవలసిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here