బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ కౌషలే….వైరల్ అవుతున్న ఫోటో!

0
282

బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ కౌషలే….వైరల్ అవుతున్న ఫోటో!

ఎన్నాళ్ళనుండో ప్రేక్షకులను అందరిని కలవరపెడుతున్న బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనే విషయమై ఇపుడే అందిన సమాచారం ప్రకారం ఫైనల్ విన్నర్ కౌషలే అని అంటున్నాయి మీడియా వర్గాలు. ఇక మొదటినుండి ఫైనల్ కంటెస్టెంట్లు గా వున్న కౌషల్, గీత మాధురి, దీప్తి నల్లమోతు, సామ్రాట్, తనీష్ లలో చివరికి ఫైనల్ విన్నర్ ఎవరో తేలేది నిజానికి రేపు. ఎందుకనగా నేడు జరిగే ఎలిమినేషన్ లో హౌస్ లో వున్న ఐదుగురిలో ముగ్గురు ఎలిమినేట్ చేయబడతారు. ఆ తరువాత మిగిలిన ఇద్దరు ఫైనల్ కి చేరుతారు. ఇక ఆ ఇద్దరిలో రేపు ఒకరు ఫైనల్ విన్నర్ గా మిగులుతారు.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటోను బట్టి చూస్తే, ఫైనల్ విన్నర్ కౌషల్ అనేది స్పష్టం అవుతోంది. అయితే కౌశల్ ఫైనల్ విన్నర్ గా ఎలా నిలుస్తాడని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఒకరకంగా ప్రేక్షకుల్లో ఎక్కువమంది మద్దతు కౌషల్ కి ఉండడం, అంతేకాక బయట కౌషల్ ఆర్మీ అతనికి వేస్తున్న ఓట్లు, మరియు చేస్తున్న హడావుడిని బట్టి చూస్తే కౌశల్ విన్నర్ గా నిలుస్తాడు అనేది చాలావరకు స్పష్టమవుతోంది. మరి ప్రస్తుతం లీకైన ఈ ఫోటోను
బట్టి చూస్తే అతడు ఫైనల్ విన్నర్ గా నిలిచాడు అనే చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే రేపటి ఫైనల్ ఎపిసోడ్ వరకు వేచిచూడవలసిందే మరి……