బిల్డప్ బాబుని మించిపోయిన బిల్డప్ బాబాయి!

0
449
తెలుగు టెలివిజన్ ఛానల్స్ లో ప్రస్తుతం ప్రసారం అవుతున్న షోలలో ఆడియన్స్ లో మంచి క్రేజ్ మరియు అద్భుతమైన రేటింగ్స్ సంపాదిస్తున్న షో ఏదంటే, అందరికి ముందుగా గుర్తుకువచ్చే పేరు జబర్దస్త్. ఈ షోలో ప్రసారమయ్యే ప్రతి ఎపిసోడ్ కూడా యూట్యూబ్ లో కొన్ని లక్షల వ్యూస్ తో దూసుకుపోతోందంటే, ఈ షోకి ప్రేక్షకుల్లో ఎంత ఆదరణ ఉందొ అర్ధం చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇందులో హైపర్ ఆది, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, వంటిరు ప్రదర్శించే స్కిట్లకు మరింత క్రేజ్ ఉంటుంది. ఇక ఇటీవల గెటప్ శ్రీను బిల్డప్ బాబాయి స్కిట్ మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించి మంచి పేరు పొందింది. అందులో శ్రీను పలికిన గుంటూరు స్లాంగ్ అందరిని ఆకట్టుకోవడమే కాక,  స్కిట్ లో పరిస్థితులను బట్టి అతడు ఇచ్చే బిల్డప్పు లు అందరితో విపరీతంగా నవ్వులు పూయించాయి.
ఇక ఆ స్కిట్ లో పెళ్లి సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లలో తనవంతుగా సాయాన్ని అందించడానికి వచ్చే బిల్డప్ బాబాయి, ఏదో అన్ని పనులు తానే చేస్తున్నట్లు, అంతేకాదు ఎందరో ప్రముఖులతో తనకు పరిచయాలు ఉన్నట్లు బిల్డప్ ఇవ్వడం, అలానే ప్రతిదానికి నేను వున్నాను కదా, నేను చూసుకుంటాను అని అతిగా రియాక్ట్ అవ్వడం వంటి అంశాలు ఆ స్కిట్ లో బాగా పండాయి. ఇక ఈ స్కిట్ లో ముఖ్యంగా పేలిన డైలాగుల్లో ‘పిసికితే గేదె నుండి పెరుగు వచ్చేయాలి’ అనే డైలాగుకు మంచి క్రేజ్ వచ్చింది. ఇకపోతే ఆ స్కిట్ ని కొంత అనుకరణగా తీసుకుని నిన్నటి జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్ బిల్డప్ బాబు అనే స్కిట్ చేసాడు. ఈ స్కిట్ లో ఒక వ్యక్తి తండ్రి చనిపోవడం, ఆయన మృతదేహాన్ని ఇంట్లో ఉంచి తదుపరి కార్యక్రమాలు జరిపించే సందర్భంగా ఆ వ్యక్తికి ఫ్రెండ్ ఆ ఎంటర్ అవుతాడు బిల్డప్ బాబు, ఇక బిల్డప్ బాబు కూడా దాదాపుగా బిల్డప్ బాబాయి మాదిరే అన్ని విషయాలు తనకు తెలిసినట్లు మెడలో ఫోన్ ఒకటి వేసుకుని, నీకెందుకు నేను వున్నాను, ఏ పని ఆయినా నాకు చెప్పవచ్చు కదా అంటూ బిల్డప్ ఇవ్వడమే ప్రధానంగా సాగుతుంది స్కిట్.
అయితే ఈ స్కిట్ లో సుధీర్ తన స్టయిల్లో గుంటూరు స్లాంగ్ ని పండించిన విధానం బాగున్నప్పటికీ, గెటప్ శ్రీను చేసిన స్కిట్ తో పోలిస్తే మాత్రం ఇది అంతగా ఆకట్టుకోలేదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ స్కిట్లో గెటప్ శ్రీను కూడా ఎంటరవడం, అలానే పాత స్కిట్ లో మాదిరి ఇందులో  ‘వేస్తే పిడకలు వచ్చేయాలి గేదె నుండి’ అని అనడం నవ్వులు పూయించింది. ఇక ఈ స్కిట్ మొత్తంలో సుధీర్ ఏ మాత్రం గెటప్ శ్రీనుని అందుకోలేకపోయాడని, గెటప్ బాబాయ్ ముందు గెటప్ బాబు నిలబడలేకపోయాడని అంటున్నారు నెటిజన్లు. కాగా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తోంది. మరి ఈ స్కిట్ పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేస్తారు కదూ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here