మరొక్కసారి ఫ్యాన్స్ పై ఫైర్ అయిన బాలకృష్ణ…. ఇంటర్నెట్ లో వీడియో వైరల్!

0
202
యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అయన తండ్రి దివంగత నందమూరి ఎన్టీ రామారావు గారి జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి అనే చెప్పాలి. ఇకపోతే విడుదలకు సిద్దమవడంతో ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో మునిగిపోయింది. అందులో భాగంగా నేడు హీరోయిన్ విద్య బాలన్, మరియు హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ తో కలిసి బాలకృష్ణ తన స్వగ్రామమైన నిమ్మకూరు చేరుకున్నారు.
Image result for balakrishna fires on fans at gannavaram airport
అయితే ఆ పర్యటనలో భాగంగా కొందరు అభిమానులు బాలకృష్ణ ను గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద గుమిగూడి ఆయనకు అభినందనలు తెలిపారు. ఇక ఒక్కసారిగా అభిమానులు రావడంతో వారితో కాసేపు ముచ్చటించి, వారితో సరదాగా మాట్లాడారు. అయితే అనుకోకుండా మరింతమంది ముందుకు దూసుకురావడంతో బాలకృష్ణ ఒక్కసారిగా వారిపై ఫైర్ అయి, వెనక్కి వెళ్ళండి, బుద్ధి ఉందా లేదా అంటూ గట్టిగా అరిచారు. అంతే ఒక్కసారిగా అక్కడి మీడియా వారందరూ ఆశ్చర్యపోయారు. ఇక ప్రస్తుతం అయన అరుస్తున్న వీడియో టాలీవుడ్ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here