మరో సారి పెళ్లి చేసుకున్న స్టార్ హీరో మహేష్ బాబు… ఖంగుతిన్న సినీపరిశ్రమ..షాక్ లో నమ్రత!

0
248
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతపెద్ద సూపర్ స్టారో అందరికి తెలిసిందే. తండ్రి కృష్ణ గారి నటవారసత్వంతో సినిమాల్లోకి చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు, ఆ సమయంలో కొన్ని సినిమాల్లో నటించారు. ఇక బాలనటుడిగా చేసిన బాలచంద్రుడు సినిమా తరువాత, తన చదువును కొనసాగించిన మహేష్ బాబు, కొన్నేళ్ళకు 1999లో హీరోగా రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. అయితే మొదటి సినిమానే అనూహ్యంగా విజయవంతం అవడంతో, అక్కడినుండి మహేష్ బాబు కు విపరీతంగా ఆఫర్లు పెరిగాయి. కానీ నాలుగవ సినిమా మురారి వరకు మళ్ళి మహేష్ కు సరైన హిట్ దక్కలేదు. ఇక ఆ తరువాత ఆయన చేసిన ఒక్కడు, ఒక్కసారిగా మహేష్ ను పెద్ద స్టార్ హీరోని చేసింది. ఇక అక్కడినుండి మహేష్ పలు విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరుగా వెలుగొందతున్నారు. అయితే అయన తన కెరీర్ లో చేసిన మూడవ సినిమా వంశి. ఇది పద్మయాల బ్యానర్ పై నిర్మితమైంది. ఇక ఈ సినిమాతోనే బాలీవుడ్ నటి, మిస్ ఇండియా అయిన నమ్రత శిరోద్కర్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ కు నమ్రతకు మధ్య ప్రేమ పుట్టడం, అది మెల్లగా రూపాంతరం చెందడం జరిగిపోయాయి.
ఇక తన కెరీర్ లో 2006లో వచ్చిన అతడు సినిమా సమయంలో చివరికి మహేష్, నమ్రతను వివాహం చేసుకున్నారు. అయితే ఈ విషయమై చాలామందికి తెలియని విషయం ఒకటుందని, నిజానికి మహేష్ బాబు నమ్రతను అంతకుముందే రహస్యంగా వివాహం చేసుకున్నారని, కాగా ఆ విషయాన్నీ గోప్యంగా ఉంచిన ఇరు కుటుంబాలు, తరువాత అధికారికంగా ముంబై లో ఇద్దరికీ అందరిముందు వివాహం జరిపించారని అంటున్నారు. నిజానికి మొదట్లో పెళ్ళికి రెండు కుటుంబాల వారు ఒప్పుకుంటారా లేదా అని భావించి వారిద్దరూ పెళ్లిచేసుకున్నారని, అయితే ఆ విషయం తెలుసుకున్న కృష్ణ గారు, మీరు రహస్యంగా పెళ్లి చేసుకున్నప్పటికీ, అందరికి తెలియాలంటే మాత్రం మరొక్కసారి ఇద్దరూ అధికారికంగా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారట. అయితే ఈ తంతు అంతా, మహేష్ మరియు నమ్రత స్నేహితులందరికీ తెలుసునని, కానీ ఇన్నాళ్లకు ఈ విషయం బయటకు వచ్చిందని కొన్ని టాలీవుడ్ వర్గాలుచెపుతున్నాయి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here