మాకు రేష్మి కావలి, భాను వద్దు అంటున్న ఫ్యాన్స్…. మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు!

0
328

ఇప్పటికే బుల్లితెరపై మంచి క్రేజీ షో గా మారిన ఢీజోడిలో కొత్తగా బిగ్ బాస్ లో పాపులరైన భానుశ్రీని తీసుకున్నారు ఆ షో నిర్మాతలు. అయితే ఈ షోపై ఉన్న క్రేజ్ అంతకంతకు పెరుగుతున్నప్పటికీ, షో లో రేష్మి స్థానంలో భాను ని తీసుకోవడంతో చాలా మంది రేష్మి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశేతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వారు కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది. ఇక మ్యాటర్ లోకి వెళితే, ఈ సీజన్ కొంత వెరైటీ గా ఉంటుందని, షోలో భాను శ్రీని తీసుకున్న యూనిట్ వారు, ప్రస్తుతం ఆమెను ఎందుకు తీసుకున్నామా అంటూ తలలు పట్టుకుంటున్నారట. అయితే దీనికి కారణం లేకపోలేదని తెలుస్తోంది.

ఒకరకంగా చాలావరకు రేష్మి అభిమానులు భానుని తీసేయండి అంటూ కామెంట్స్ చేయడం ఒకటి అయితే, మరొకటి ఆమెను షోలో తీసుకున్నప్పటినుండి షో కి అదివరకటితో పోలిస్తే వస్తున్న టిఆర్పి కొంత తగ్గిందట. అయితే ఈ విషయమై యాజమాన్యం మాత్రం రేష్మీకి ఓటు వేసిందని, మరికొద్దిరోజుల్లో ఆమెనే మళ్ళి షోలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు రేష్మీని మళ్ళి తీసుకున్నట్లుగా ఆ ప్రోగ్రామ్ కి సంబందించిన కొన్ని ఫోటోలు ఇప్పటికే ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి. నిజానికి బిగ్ బాస్ లో ఉన్నపుడు ఏ మాత్రం మొహమాటం, ఒక పద్ధతి లేకుండా ప్రవర్తించి, ఇక బయటకు వచ్చాక కూడా షోపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన భానుని షోలో ఎలా తీసుకున్నారని కొందరు రేష్మి అభిమానులు ప్రశ్నిస్తున్నారట.

ఇకపోతే రేష్మీకి తీసుకోకపోవడానికి కారణం, ఆమె డేట్లు ఖాళీ లేకపోవడమేనని, ఇక ప్రస్తుత పరిస్థితుల్లో షోకి ఏమాత్రం, క్రేజ్, టీఆర్పీలు తగ్గకుండా ఉండడానికి మళ్ళి రేష్మినే తీసుకుందామని నిర్ణయించారట. ఇక కొందరు భాను అభిమానులు కూడా రేష్మి పై మండిపడుతున్నారు, నిజానికి భాను కూడా ఎంతో ఆకట్టుకునేలా షో చేస్తోందని, అయితే ఆమెను అర్ధంతరంగా తీసివేయవద్దని వారు కూడా కామెంట్స్ చేస్తున్నారట. మరి ఈ వివాదంలో చివరికి ఏ విధంగా అలోచించి షో నిర్వాహకులు చివరకు ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here