మాష్టారుకి 60 స్టూడెంట్ కి 20….. ప్రేమకోసం పారిపోయి షాకిస్తున్న ప్రేమజంటలు!

0
253
ఇటీవల కాలంలో మనిషి ఆలోచనలు ఎటువైపు పోతున్నాయో అనేది చెప్పడం కష్టతరంగా మారిందని చెప్పుకోవాలి. ఇక మనలోని కొందరు చేస్తున్న వికృత చేష్టలు చూస్తుంటే ఒకరకంగా ఆశ్చర్యం వేయకమానదు అని చెప్పుకోవాలి.
మరీ ముఖ్యంగా నేడు దేశాన్ని మరింత కలవరపెడుతున్న ఘటనల్లో వివాహేతర సంబంధాలు, ప్రేమ కోసం ఎంతటి పనికి అయినా తెగించడం వంటివి పలు విమర్శలకు తావిస్తున్నాయి. చదువు చెప్పే మాష్టారుకి, చదువు నేర్పే విద్యార్థికి మధ్య సంబంధం ఎంతో పవిత్రమైనది. అటువంటి బంధానికి కొందరు కళంకం తెస్తూ చెడ్డపేరు తెస్తున్నారు. ఇక మ్యాటర్ లోకి వెళితే, దేశంలోని రెండు రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు ఘటనలు చూస్తే మాత్రం ఎంతటి వారైనా షాక్ అవుతారు. కేరళ మరియు తమిళ నాడు రాష్ట్రాలలో ఈ వింత ఘటనలు జరిగాయి. కేరళలో అతడో కాలేజీ లెక్చరర్, ఆయనకి 60 ఏళ్ళు, ఇక అయన విద్యాబుద్ధులు చెప్పే విద్యార్థినికి 20 ఏళ్ళు.
ఇద్దరూ ఒకరిపై మరొకరు మనసుపారేసుకుని ఇటీవల రహస్యంగా ఊరు విడిచి వెళ్లిపోయారు. ఇక మరొకటి ఏంటంటే, తమిళనాడులో స్వయానా విద్యను నేర్పే 40 ఏళ్ళ టీచర్, తాను చదువు చెప్పే 15 ఏళ్ళ విద్యార్థి మాటలు, అతడి వ్యక్తిత్వం, అందం నచ్చి ఒక రాత్రి సమయాన ఆ విద్యార్థితో కలిసి ఊరు విడిచి పారిపోయింది.
అయితే మనం చెప్పుకున్న ఈ రెండు ఘటనల్లో ఆయా విద్యార్థుల తల్లితండ్రులు జరిగిన ఘటనలపై పోలీసులను ఆశ్రయించడంతో, పోలీసులు వారికోసం ముమ్మర గాలింపు చేపట్టి ఎట్టకేలకు ఆ జంటలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సోషల్ మిడియాలో వైరల్ గా మారిన ఈ రెండు ఘటనలను గురించి పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. రోజూ ఏదో ఒక వింత ఘటన వింటున్న మన జనానికి, ఇటువంటివి సర్వసాధారణం అయిపోయాయి. ఏమంటారు ఫ్రెండ్స్…..