మీ భార్యలో ఈ విషయాలు గమనిస్తే అనుమానించాల్సిందే!|telugugaramchai

0
217
నేటి జీవితంలో పెళ్లిళ్లు చేసుకుంటున్న జంటలు ఒకరిపై మరొకరికి సరైన అవగాహన లేక, అలానే ఒకరిని మరొకరు అర్ధం చేసుకోలేక పవిత్రమైన వివాహబంధాన్ని అపహాస్యం చేస్తూ చెడకొట్టుకుంటున్నారు. అంతేకాదు కట్టుకున్న జీవిత భాగస్వామితో సంసారం సరిగ్గా చేయకుండా, వేరేవారితో అక్రమ సంబంధాలు పెట్టుకుని నిండునూరేళ్ళ అనుబంధాన్ని భగ్నం చేసుకుంటున్నారు అనే చెప్పాలి. ఇక మరీ ముఖ్యంగా ఒకరిపై మరొకరికి అనుమానం పెనుభూతంలా మారి చివరికి విడాకులు తీసుకునేదాకా వెళ్తున్నాయి. ఇక మరికొందరైతే ఈ అనుమానాలతో తమ ప్రాణాలు తీసుకోవడం లేదా, తమ జీవిత భాగస్వామి ప్రాణాలు తీయడం వంటివి చేస్తున్నారు. ఇక మీ జీవిత భాగస్వామి అయిన భార్య, ఈ విధంగా కనుక ప్రవర్తిస్తుంటే ఆమె తప్పుదారి పట్టినట్లు కొంత అనుమానించవచ్చని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ప్రకారం మీ భార్య ఎక్కువగా ఫోన్ లో ఒంటరిగా మాట్లాడుతున్నా, లేదా మీతో కలిసి రాత్రి శృంగారం జరుపుతున్న సమయంలో కొంత చికాకు పడుతున్నా, లేక ఎక్కువగా వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి వాటిని మీకు చూపకుండా దాస్తున్నా, లేక ఏవైనా ఆలోచనలతో పరధ్యాహ్నంగా వున్నా, లేక ఎప్పుడు ఏవో ఆలోచనలు చేస్తూ మాధానపడుతున్నా,
అదే ఉద్యోగం చేసే అమ్మాయి అయితే, ఇంటికి రావడం కంటే ఎక్కువసేపు ఆఫీసులో గడపడానికి ఇష్టపడుతున్నా, లేక ఆఫీస్ సమయం కంటే కూడా తరచూ చాలా ఆలస్యంగా వస్తున్నా, లేక భర్తతో కంటే ఇతరులతో మాట్లాడుతూ వారితోనే ఎక్కువ సమయం గడుపుతున్నా….మనం చెప్పుకున్న ఇటువంటి ఘటనలు మీ భార్య విషయంలో కనుక కనపడితే ఆమె కొంత తప్పుడు దారుల్లో వెళ్లే ప్రమాదముందని అంటున్నారు నిపుణులు. అయితే ఇక్కడ అన్నిటికంటే ఒక ముఖ్యమైన విషయాన్నీ వారి భర్తలు గుర్తుంచుకోవాలని వారు అంటున్నారు. అదేమిటంటే, పెళ్లిచేసుకున్నాక చాలామంది  భర్తలు తమ భార్యను కేవలం పిల్లలుకనే యంత్రాలుగా భావిస్తారని, అలా కాకుండా ఆమె అభిరుచులు, ఇష్టాలు తెలుసుకుని అప్పుడపుడు ఆమెను సంతోష పరచాలని, అంతేకాక వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినపుడు వారికి తోడు నీడగా ఉండాలని, ఇక కష్టం వచ్చినపుడు తమ తల్లితండ్రులు గుర్తుకురాకుండా భర్తలు వారి బాధను పంచుకోవాలని అంటున్నారు. ఇలా కనుక భర్తలు తమ ప్రవర్తనను మార్చుకుంటే ప్రపంచంలోని ఏ భార్య కూడా పెడదారి పట్టదని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here