అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్!

0
194
ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, మరియు ఫ్లిప్ కార్ట్ ల పై కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయంతో గట్టిగా కొరడా ఝుళిపించింది. ఇప్పటివరకు ఈ కామర్స్ వ్యాపారంలో మన దేశంలో అగ్రగాములుగా ముందుకు దూసుకెళ్తున్న ఈ రెండు సంస్థలు ఈ నిబంధనలతో కొంత ఆలోచనలో పడ్డట్లు సమాచారం. ఇక వివరాల్లోకి వెళితే,  ఇకపై విదేశీ పెట్టుబడులను కలిగి ఉన్న ఏదేని సంస్థలో వాటాను కలిగి ఉంటే ఆ సంస్థ ఉత్పత్తులను విక్రయించకూడదని ప్రభుత్వం నిషేధం విధించింది. అలానే ఎలాంటి పక్షపాత ధోరణిని అవలంబించకుండా విక్రేతలందరికీ సమాన స్థాయిలో సేవలందించాలని కూడా వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశీయ సంస్థల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విధాన నిబంధనలను సవరించినట్లు పేర్కొంది. ఈ విధానం ప్రకారం, ఒక ఇ-కామర్స్‌ సంస్థకు చెందిన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంపై విక్రయ సంస్థలు 25 శాతానికి మించి ఉత్పత్తులను అమ్మే వీల్లేదు.
Image result for flipkart and amazon
అలాగే ఆన్‌లైన్‌ సంస్థలు తమ ప్లాట్‌ఫాంపై ఫలానా వస్తువును ప్రత్యేకంగా విక్రయించేందుకు విక్రయదారుతో ఒప్పందాలు కుదుర్చుకునే అనుమతి కూడా లేదని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. విక్రయ సంస్థల్లో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా వాటాను కలిగి ఉన్నప్పటికీ, ఆ సంస్థలకు అందించే లాజిస్టిక్స్‌, ప్రకటన, గిడ్డంగులు, మార్కెటింగ్‌, చెల్లింపుల సేవల విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదని తెలిపింది. అయితే ఈ తరహా నిర్ణయంతో ఈ రెండు సంస్థల ప్రతినిధులు మరింత లోతుగా ఆలోచనలు చేస్తూ వినియోగదారులకు ఏవిధంగా చేరువ అవ్వాలి అని తమ సంస్థ ప్రతినిధులతో ఈ మేరకు చర్చలు కూడా చేపట్టినట్లు సమాచారం అందుతోంది.  ప్రస్తుతం ఇ-కామర్స్‌ సంస్థల్లో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాబోయే రోజుల్లో ఈ కామర్స్ వ్యాపారంలో ఎటువంటి మార్పులు వస్తాయో తెలియాలంటే మాత్రం కొన్నాళ్ళు ఆగవలసిందే…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here